Just EntertainmentLatest News

Rajinikanth :రజనీ కాంత్ లైఫ్‌లోనూ ఓ అమ్మాయి ఉంది.. తను ఎవరో కాదు..

Rajinikanth : రజనీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ అమ్మాయి ఎవరు?

Rajinikanth

ఒకప్పుడు బస్సుల్లో టికెట్లు చిందిస్తూ, జనాల గోలలో జీవితాన్ని దాచుకున్న ఒక కండక్టర్… నేడు కోటీ కోట్లు అభిమానుల గుండెల్లో వెలుగులా నిలిచిన సూపర్ స్టార్. అయితే ఎంత ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా… తన గుండెల్లో మాత్రం ఓ ఖాళీ మిగిలే ఉంది అంటున్నాడు రజనీకాంత్. తన తర్వాతి చిత్రం కూలీ(Coolie movie) ప్రీ-రిలీజ్ వేడుకలో రజనీ తన హృదయాన్ని తాకిన చెప్పిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నన్ను నటుడిని చేసింది ఆమె. కానీ నేను ఆమెను ఎప్పుడూ మళ్లీ చూడలేదంటూ కన్నీటితో తనని తానే తడిపేసిన రజనీ మాటలు ఇప్పుడు ప్రతి అభిమాని గుండెను కదిలిస్తున్నాయి. తన కండక్టర్ రోజుల్లో, రజనీకాంత్‌(Rajinikanth)కి ఓ అమ్మాయి పరిచయమైయ్యింది. మొదట చిన్న గొడవలా మొదలై, ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆమె అందం కాదు.. ఆమె ఉనికే తన జీవితాన్ని మార్చేసిందని రజనీ చెప్పాడు. ఓసారి ఆమెతో కలిసి డ్రామా చూసేందుకు రావాలని అడిగినప్పుడు, ఆమె ఆశ్చర్యంతో, నువ్వు యాక్టింగ్ (Super Star Rajinikanth )కూడా చేస్తావా? అని అడిగిందట. తర్వాత ఆమె అతనిలో దాగి ఉన్న నటుడిని చూసి..నీవు ఒకరోజు గొప్ప నటుడవుతావంటూ ఊహించలేని మాటలతో ధైర్యం చెప్పిందట.

Rajinikanth
Rajinikanth

అంతేకాదు.. తన వద్ద ఉన్న కొంత డబ్బును ఇచ్చి, “బాగున్న ఫోటోలు తీయించు, ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్లు” అని తనే ప్రోత్సహించిందంట. ఆ మాటలు ఆయన జీవితానికే మలుపు తిప్పిన మంత్రాలయ్యాయట. ఎన్నోసారి ఆ అమ్మాయి తనను వెనుక నుంచి మద్దతు ఇచ్చిందట. కానీ, తాను స్టార్ అయిన తర్వాత… ఆమె ఒక్కసారి కూడా కనిపించలేదంటూ… మౌనంగా, కలవరంగా చెబుతున్నాడు రజనీ. ఆ అమ్మాయి కోసం ఎన్నో చోట్ల వెతికినప్పటికీ ఎక్కడా తనను మళ్లీ చూడలేకపోయానన్నాడు.

నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి, నా విజయాన్ని ముందు ఊహించిన వ్యక్తి ఆమె. నేను బతికే ఉన్నానంటే అది ఆమె అండ కారణమే” అని చెప్పే స్థాయిలో ఆమెపై గౌరవం ఉంచుకున్నాడు రజనీ కాంత్. ఆ అమ్మాయి పేరు ఏంటో చెప్పలేదు గానీ… ఆమెను మళ్లీ కలవాలన్న తాపత్రయం మాత్రం అందరి ముందూ బయటపెట్టాడు.

ఎవరైనా చిన్న స్థాయి నుంచి స్టార్ స్థాయికి ఎదిగిన తర్వాత, పాతవాళ్లను, తమ జీవితంలో చేసిన మంచిని మరిచిపోవడం తేలిక. కానీ కొందరు మాత్రం ఎంత ఎదిగినా తలవంచి ఆ బంధాలను గుర్తు చేసుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో రజనీకాంత్ ఒకరు. అతి సామాన్య స్థితి నుంచి అతి పెద్ద స్టార్‌గా ఎదిగినా.. ఒకే ఒక్క అమ్మాయి తన జీవితం ఎలా మార్చిందో, ఎలా స్ఫూర్తి ఇచ్చిందో జీవితాంతం మరిచిపోకుండా, ఇప్పటికీ ఆమె కోసం కళ్లు ఎదురుచూస్తున్నాడంటే, నిజంగా ఆయన హృదయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక్క రోజు అయినా ఆ అమ్మాయి రజనీ కాంత్(Rajinikanth) ముందు ప్రత్యక్షమవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button