Ganesh: ఖైరతాబాద్‌ గణనాథుడికి వీడ్కోలు

Ganesh: ఈరోజు జరిగే భారీ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్ శాఖలతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

Ganesh

శనివారం నాడు హైదరాబాద్ మహానగరం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. గత పది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల(Ganesh)ను నిమజ్జనం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ట్యాంక్‌బండ్ చుట్టూ తెల్లవారుజాము నుంచే విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది.

భక్తులు, వాహనాల రద్దీతో ట్యాంక్‌బండ్‌ ప్రాంతం పూర్తిగా కిక్కిరిసిపోయింది. నగరం అంతటా కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ మహా గణపతి(Ganesh) నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. నిజానికి ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది.

విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన వాహనంలో విగ్రహాన్ని ఎక్కించే సమయంలో జరిగిన వెల్డింగ్ పనుల వల్ల ఈ జాప్యం జరిగినా ఇప్పుడు ఈ కార్యక్రమం కన్నుల పండువగా శోభాయాత్ర సాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తవుతుందని, ఇంకా ముందుగా కూడా అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈరోజు జరిగే భారీ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్ శాఖలతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 160 యాక్షన్ టీమ్‌లు నిరంతరం పని చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి 15 వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాకుండా, నిమజ్జనం కోసం 134 క్రేన్‌లు, 260కి పైగా మొబైల్ క్రేన్‌లను ఏర్పాటు చేశారు.

Mumbai: హ్యూమన్ బాంబు పేరుతో బెదిరింపు.. ముంబైలో హై అలర్ట్

Exit mobile version