Metro:మెట్రో మూడో దశకు గ్రీన్ సిగ్నల్.. శివారు ప్రాంతాల వరకు రైలు

Metro: వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం 15 కిలోమీటర్ల మేర మెట్రో ట్రాక్ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Metro

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో(Metro) రైలు విస్తరణకు సంబంధించి కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయి ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, రెండో దశ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

అయితే ఇప్పుడు అందరి దృష్టి మూడో దశ విస్తరణపై పడింది. ఈ దశలో ఏకంగా 178 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా శివారు ప్రాంతాల వరకు మెట్రో రైలు వెళ్లనుంది. మేడ్చల్, పటాన్ చెరువు, ఘట్‌కేసర్, హయాత్ నగర్ మరియు శామీర్ పేట్ వంటి దూర ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా ఈ(Metro) ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల నుండి సిటీలోకి రావాలంటే ప్రజలు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ట్రాఫిక్ వల్ల దాదాపు రెండు గంటల సమయం వృధా అవుతోంది.

Metro

మెట్రో(Metro) అందుబాటులోకి వస్తే కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు లేదా ఐటీ కారిడార్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం 15 కిలోమీటర్ల మేర మెట్రో ట్రాక్ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల 2047 నాటికి హైదరాబాద్ మెట్రో మొత్తం 400 కిలోమీటర్ల నెట్‌వర్క్‌గా మారుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలుస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ నుండి ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ టేకోవర్ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఆ తర్వాత విస్తరణ పనులు మరింత వేగం పుంజుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మరియు నిధుల కేటాయింపు ప్రక్రియలను కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఒకసారి ఈ పనులు పూర్తయితే హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా సగానికి పైగా ఆదా అవుతుంది. ఐటీ ఉద్యోగులకే కాకుండా సామాన్యులకు కూడా మెట్రో ఒక వరప్రసాదంలా మారబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version