Heavy rain: అల్పపీడనం అలర్ట్..మళ్లీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Heavy rain: సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణశాఖ అంచనా వేసింది.

Heavy rain

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు(Heavy rain) ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. తాజాగా వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతోందని అంచనా వేసింది. ఇది అక్కడితో ఆగకుండా, సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వైపు కదులుతుందని పేర్కొంది. ఈ పరిణామంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలం ముగిసే చివరి దశలో ఇలాంటి వాతావరణ మార్పులు(Weather Forecast) సంభవిస్తాయి. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు రుతుపవనాల చివరి దశ ఉధృతి అని చెప్పవచ్చు. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు కూడా వరద ఉద్ధృతితో ఉరకలేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలు జలమయమై రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. శనివారం (ఆగస్టు 30) ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాలకు వర్షాలు(Heavy rain ) తప్పవని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాల(Heavy rain) తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version