Global city
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ప్రపంచ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిభావంతమైన 100 ఉత్తమ నగరాల (World’s Best Cities) జాబితాలో హైదరాబాద్ స్థానం సంపాదించింది.
రెసోనెన్స్ కన్సల్టెన్సీ , ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఆధారంగా ఈ ‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ నివేదికను రూపొందించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 276 నగరాలను వివిధ పారామితులపై అధ్యయనం చేసి, వాటిలో 100 నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.
ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ నగరం 82వ స్థానం దక్కించుకుంది. భారతదేశం నుంచి మొత్తం నాలుగు నగరాలు ఈ టాప్ 100 జాబితాలో మెరిశాయి, ఇందులో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.
- బెంగళూరు: 29వ స్థానం
- ముంబై: 40వ స్థానం
- ఢిల్లీ: 54వ స్థానం
- హైదరాబాద్: 82వ స్థానం
భారతదేశం నుంచి ఈ నాలుగు నగరాలు గ్లోబల్ టాప్(Global city) 100లో చోటు దక్కించుకోవడం దేశ ఆర్థిక, సాంకేతిక ప్రగతికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలోని టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు కేంద్రంగా, కార్పొరేట్ బేస్‌కు విస్తృత కేంద్రంగా బెంగళూరు ముందు నిలిచింది. ఇన్నొవేషన్, టాలెంట్ ఆకర్షణలో ఈ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
దేశ ఆర్థిక రాజధానిగా, ఉపాధి అవకాశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మరియు వినూత్న కేంద్రంగా (Innovation Hub) ముంబై తన ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
రాజకీయం, రవాణా కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల (Emerging Infrastructure) ఆధారంగా ఢిల్లీ ఈ స్థానాన్ని సాధించింది.
టెక్నాలజీ రంగంలో విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా పెరుగుతున్న ఇంపార్టెన్స్, జీవన ప్రమాణాల మెరుగుదల కారణంగా హైదరాబాద్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా నిలిచింది.
టాప్ ప్లేస్ & నోటబుల్ పాయింట్స్..
గ్లోబల్ లీడర్.. ‘క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్స్’గా పేరుగాంచిన లండన్ నగరం వరుసగా 11వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీని తర్వాత న్యూయార్క్ (2), ప్యారిస్ (3), టోక్యో (4), మరియు మాడ్రిడ్ (5) ఉన్నాయి.
టేస్టీ సిటీస్.. హైదరాబాద్(Global city)కు కేవలం ఉత్తమ నగరాల జాబితాలోనే కాకుండా, టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలోనూ చోటు దక్కింది. అద్భుతమైన వంటకాలు, కల్నరీ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ జాబితాలో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచింది.
కొన్ని నగరాలు ఔట్.. ఈ గ్లోబల్ మెగా లిస్ట్‌లో చెన్నై, కోల్‌కతా వంటి చారిత్రక, పెద్ద నగరాలను కూడా పక్కనపెట్టి హైదరాబాద్ ముందంజలో నిలవడం విశేషం.
ఈ ర్యాంకింగ్ హైదరాబాద్ (Global city)కేవలం ఒక టెక్ సిటీ మాత్రమే కాదని, గ్లోబల్ లివింగ్, కల్చర్ , టేస్ట్ పరంగానూ తన ప్రత్యేకతను చాటుతోందని నిరూపించింది.
