Just SpiritualJust Andhra PradeshLatest News

Tirumala:శ్రీవారి భక్తలకు అలర్ట్..జనవరి శ్రీవారి సేవలు,దర్శన టిక్కెట్ల విడుదల తేదీలు..

Tirumala: శ్రీవారి దర్శనంతో పాటు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు నవంబర్ 2025 నెలకు సంబంధించి అక్టోబర్ 25, 2025, ఉదయం 10:00 గంటలకు విడుదల కానున్నాయి.

Tirumala

తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. జనవరి 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, అంగప్రదక్షిణం, వసతి కోటాలను తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala) (టీటీడీ) విడతలవారీగా విడుదల చేయనుంది. భక్తులు తమ బుకింగ్‌లను సకాలంలో పూర్తి చేసుకోవడానికి తేదీలు, సమయాలను కచ్చితంగా గమనించాలి.

ముందుగా, అదృష్టం ద్వారా లభించే సేవలు, అంగప్రదక్షిణ టోకెన్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 19, 2025, ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభమై, అక్టోబర్ 21, 2025, ఉదయం 10:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఆ తర్వాత, డిప్ అవసరం లేని సేవలు, అంటే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను అక్టోబర్ 23, 2025, ఉదయం 10:00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు, సాయంత్రం మధ్యాహ్నం 3:00 గంటలకు, తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి వర్చువల్ సేవలకు (ఆన్‌లైన్ పార్టిసిపేషన్) , వాటికి అనుసంధానంగా ఉండే దర్శన కోటాను కూడా బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతారు.

Tirumala
Tirumala

ప్రత్యేక కేటగిరీలైన సీనియర్ సిటిజన్లు , వికలాంగుల కోటా బుకింగ్‌లు అక్టోబర్ 24, 2025, మధ్యాహ్నం 3:00 గంటలకు తెరవబడతాయి. సామాన్య భక్తులు అత్యధికంగా బుక్ చేసుకునే స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లను అక్టోబర్ 25, 2025, ఉదయం 10:00 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు, సాయంత్రం మధ్యాహ్నం 03:00 గంటలకు, జనవరి 2026 నెలకు సంబంధించిన తిరుమల , తిరుపతి(Tirumala) వసతి కోటా బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.

శ్రీవారి దర్శనంతో పాటు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు నవంబర్ 2025 నెలకు సంబంధించి అక్టోబర్ 25, 2025, ఉదయం 10:00 గంటలకు విడుదల కానున్నాయి. ఇంకా, నవంబర్ 2025 నెలకు సంబంధించిన టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోటా ,అలిపిరి సప్తగిరి ప్రదక్షిణ శాలలో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు అక్టోబర్ 27, 2025, ఉదయం 10:00 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులోకి వస్తాయి. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బుకింగ్‌లను చేసుకోవాలి.

India vs Australia: గిల్ కెప్టెన్సీకి కంగారూ సవాల్

Related Articles

Back to top button