Just TelanganaJust PoliticalLatest News

Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?

Harish Rao: ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారులు, పోలీసులు, ఇతరులనే సిట్ విచారించింది.

Harish Rao

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఒక్కసారిగా జోరందుకుంది. కేసు విచారణలో భాగంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావుకు (Harish Rao ) సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తులో పలువురు నిందితులను సిట్ విచారించింది. లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ చాలా విషయాలు వెలుగుచూసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో నిందితులుగా భావిస్తున్న కొందరు ఇచ్చిన వాంగూల్మం ఆధారంగానే హరీశ్ రావు (Harish Rao ) ను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన ఒక అగ్రనేతకు ఈ కేసులో నోటీసులు రావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారులు, పోలీసులు, ఇతరులనే సిట్ విచారించింది.

ఇప్పుడు తొలిసారి పెద్ద నేతను విచారించబోతోంది. హరీశ్ రావు (Harish Rao ) ఈ నోటీసుకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. సమగ్ర విచారణ కోసం సీపీ సజ్జనార్ సారథ్యంలో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతోంది. కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు సమగ్రమైన ఛార్జ్ షీట్ ను పక్కా ఆధారాలతో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు.

Harish Rao
Harish Rao

ప్రస్తుతంఈ కేసులోఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌‌‌ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పలుమార్లు ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు కూడా రాబట్టినట్టు సమాచారం. అలాగే ఇప్పటివరకూ సేకరించిన సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల వాంగ్మూలం వంటివాటిని పరిగణలోకి తీసుకుని సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది.

మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పలువురి పేర్లను నిందితులుగా చేర్చినట్టుగా భావిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. వారికి కోర్టు బెయిల్ ఇవ్వకుండా తమ వాదనను సిట్ బలంగా వినిపించింది. ఇప్పుడు హరీశ్ రావుకు నోటీసులిచ్చి విచారణకు పిలడంతో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ హాట్ టాపిక్ గా మారిపోయింది.

Vygha Reddy :పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వారంతా వేస్ట్ ఫెలోస్..వైరల్ అవుతోన్న వైఘారెడ్డి కామెంట్స్

 

Related Articles

Back to top button