Master Plan: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్.. లక్ష్యం ఏంటి?

Master Plan: టీసీయూఆర్ ఏర్పాటు ద్వారా ఏర్పడే ఈ విస్తరించిన మహా నగరానికి సరికొత్త, ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ (Master Plan) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Master Plan

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరం యొక్క భౌగోళిక, పరిపాలనా సరిహద్దులను శాశ్వతంగా పునర్నిర్వచించే దిశగా కీలక నిర్ణయం(Master Plan) తీసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధి, దానికి ఆనుకుని ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిసర మున్సిపాలిటీలను ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’ (TCUR – Telangana Core Urban Region) గా గుర్తించేందుకు రంగం సిద్ధమైంది. ఈ (Master Plan)నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనా స్వరూపం పూర్తిగా మారనుంది.

రెండేళ్లుగా ఈ ప్రాంతాన్ని అనధికారికంగా ‘టీసీయూఆర్’గా పిలుస్తున్నా, దీనికి ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ సమయంలో పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన పట్టణాభివృద్ధి కోసం టీసీయూఆర్‌కు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టానికి అవసరమైన సవరణలు చేయనున్నారు. ఈ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ బుధవారం (రేపటి) నుంచి వెలువడనుంది. దీంతో ఇకపై ఈ విస్తరించిన ప్రాంతాన్ని అధికారికంగా ‘టీసీయూఆర్’గా పరిగణించనున్నారు.

27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ద్వారా విస్తరణ.. టీసీయూఆర్‌కు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మొత్తం మూడు కీలకమైన ఆర్డినెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మూడింటిలో ప్రధానమైనది ..ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను (Urban Local Bodies – ULBs) పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయడం.

Master Plan

ఈ రెండు విలీన సంబంధిత ఆర్డినెన్స్‌లకు కూడా బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ పరిపాలనా పరిధి, జనాభా, విస్తీర్ణం భారీగా పెరగనుంది.

టీసీయూఆర్ ఏర్పాటు ద్వారా ఏర్పడే ఈ విస్తరించిన మహా నగరానికి సరికొత్త, ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ (Master Plan) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ-2050 మాస్టర్ ప్లాన్ పనులు జరుగుతున్నా.. టీసీయూఆర్ పరిధి కోసం మరింత ప్రత్యేక దృష్టితో ఈ ప్రణాళికను రూపొందించనున్నారు.

ఈ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌(Master Plan)లో మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతారు.

Master Plan

ఈ చర్యలన్నీ హైదరాబాద్‌ను కేవలం నగరంగా కాకుండా, అత్యున్నత మౌలిక వసతులతో కూడిన ప్రపంచ స్థాయి ‘కోర్ అర్బన్ రీజియన్‌’గా తీర్చిదిద్దడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version