Sugar Daddy:ఏంటీ ‘షుగర్ డాడీ, షుగర్ మమ్మీ’ కల్చర్.. దీని వల్ల కలిగే ముప్పు ఏంటి?

Sugar Daddy: పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతైన షుగర్ డేటింగ్ కల్చర్ ఇప్పుడు నగర యువతపై ఎఫెక్ట్ చూపిస్తోంది .

Sugar Daddy

హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీలో లైఫ్ స్టైల్ చాలా వేగంగా మారిపోతుంది. దీనిలో భాగంగానే పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతైన షుగర్ డేటింగ్ (Sugar Dating) కల్చర్ ఇప్పుడు నగర యువతపై ఎఫెక్ట్ చూపిస్తోంది . గతంలో ముంబై వంటి ప్రాంతాల్లో, ఎప్పుడో వినిపించిన ఈ పదాలు, ఇప్పుడు డేటింగ్ యాప్స్ ద్వారా ఓపెన్‌గానే చర్చకు వస్తున్నాయి. అసలు ఈ కల్చర్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? దీని వల్ల కలిగే లాభనష్టాలేంటని చాలామంది ఆరా తీస్తున్నారు

షుగర్ డాడీ(Sugar Daddy) ,షుగర్ మమ్మీ అంటే.. వయసులో చాలా పెద్దవారై, ఆర్థికంగా బాగా స్థిరపడిన వ్యక్తులు. వీరు తమకంటే చాలా తక్కువ వయసున్న యువతీయువకులతో ఫిజికల్ రిలేషన్ కలిగి ఉంటారు. వీరిని షుగర్ బేబీస్ అంటారు. దీనికి బదులుగా ఆ యువతీయువకులకు ఖరీదైన గిఫ్టులు, డబ్బు, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ లైఫ్‌ను అందిస్తారు.ఒకప్పుడు షుగర్ డాడీ(Sugar Daddy)లు మాత్రమే ఉండగా..ఇప్పుడు షుగర్ మమ్మీ కల్చర్ కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయట.

ఈ కల్చర్ 2000వ సంవత్సరంలోనే అమెరికా, యూరప్ దేశాల్లోని డేటింగ్ సైట్ల ద్వారా బాగా ఫేమస్ అయింది. అయితే మన దేశంలోకి ఇది సుమారు పదేళ్ల క్రితం మెట్రో నగరాల ద్వారా ప్రవేశించినా,ఈ రెండు మూడేళ్లలోనే హైదరాబాద్‌లో దీని వ్యాప్తి విపరీతంగా పెరిగింది.

యువతలో విలాసవంతమైన జీవితం పట్ల వ్యామోహం పెరగడమే దీనికి ప్రధాన కారణం. కష్టపడకుండానే బ్రాండెడ్ వస్తువులు, ఐఫోన్లు, ఖరీదైన కార్లలో తిరగాలనే కోరికతో చాలా మంది విద్యార్థులు,చిరు ఉద్యోగులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు, ఒంటరితనంతో బాధపడే ధనవంతులు తమకు తోడు కావాలని ఇలాంటి సంబంధాలను ప్రోత్సహిస్తున్నారు.

Sugar Daddy

యువతకు ఆర్థిక ఇబ్బందులు తీరడం, విలాసవంతమైన జీవితం లభించడం వంటివి దీనిలో బయటకు లాభాలుగా కనిపిస్తాయి.కానీ లోతుగా చూస్తూ ఇందులో ఉండేది నిజమైన ప్రేమ కాదు, కేవలం ఒక ‘బిజినెస్ డీల్’ వంటిది. దీనివల్ల యువతలో ముఖ్యంగా అమ్మాయిలలో భావోద్వేగ స్థిరత్వం దెబ్బతింటుంది. నిజమైన బంధాల పట్ల గౌరవం పోతుంది.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమయ్యే ఈ వ్యక్తులు ఎవరనేది తెలియదు. దీనివల్ల బ్లాక్ మెయిలింగ్, శారీరక వేధింపులు మరియు సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
చదువుకోవాల్సిన వయసులో లేదా జీవితంలో స్థిరపడాల్సిన వయసులో యువత ఇలాంటి అడ్డదారులకు అలవాటు పడితే, కెరీర్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఒక్కసారి ఈ విలాసాలకు అలవాటు పడితే తిరిగి సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది.

ఈ కల్చర్ సమాజంలోని నైతిక విలువల పతనానికి దారి తీస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషయంలా కనిపించినా, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుంది. యువత తమ ప్రతిభను నమ్ముకోకుండా, దొడ్డిదారిన డబ్బు సంపాదించే పద్ధతులకు బానిసలవుతారు. చివరికి ఇది డ్రగ్స్, సెక్స్ రాకెట్లు వంటి చీకటి కోణాలకు కూడా దారి తీసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version