Just TelanganaJust PoliticalLatest News

Speaker:తెలంగాణలో ఫిరాయింపుల మలుపు..స్పీకర్ తీర్పుతో మారిన సమీకరణాలు

Speaker: బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన వీడియోలు, మీడియా రిపోర్టులు ఎమ్మెల్యేల అనర్హతకు సరిపోవని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

Speaker

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ తెర దించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు వెల్లడించారు.

తాజా తీర్పుతో కలిపి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది. వీరంతా ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని, వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్(Speaker) స్పష్టం చేశారు. ఈ తీర్పు ఇప్పుడు అటు అధికార కాంగ్రెస్ లో జోష్ నింపగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

కాగా ముందుగా ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చిన స్పీకర్(Speaker), తాజాగా మరో ఇద్దరు సీనియర్ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

1. తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
2. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల)
3. గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు)
4. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్)
5. అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
6. తాజాగా -కాలే యాదయ్య (చేవెళ్ల)
7. తాజాగా -పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ)

వీరిద్దరూ పార్టీ మారలేదని, సాంకేతికంగా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారని స్పీకర్ ధ్రువీకరించారు. దీంతో బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.

స్పీకర్ తీర్పు వెనుక ఉన్న లాజిక్ ఇదే అంటున్నారు ..పిటిషన్లను తిరస్కరించడానికి స్పీకర్ ప్రధానంగా ఆధారాల లోపాన్ని ఎత్తిచూపారు. బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన వీడియోలు, మీడియా రిపోర్టులు ఎమ్మెల్యేల అనర్హతకు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ శీతాకాల సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు కూర్చోవడంపై స్పీకర్ స్పందిస్తూ.. అసెంబ్లీలో ఒకవైపు కూర్చోవడం అనేది పార్టీ మారినట్లు లెక్కలోకి రాదని స్పష్టం చేశారు.

అలాగే, ఎమ్మెల్యేలు తమ వాదనలో తాము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాం తప్ప, ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పడం స్పీకర్ తీర్పుకు బలాన్నిచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా (పదవ షెడ్యూల్) ప్రకారం ‘వాలంటరీ సపోర్ట్’ లేదా అధికారికంగా పార్టీ మారినట్లు బలమైన సాక్ష్యాలు ఉండాలని స్పీకర్ అన్నారు.

Speaker
Speaker

మొత్తంగా పది మందిలో ఏడుగురికి ఊరట లభించగా, మిగిలిన ముగ్గురి భవితవ్యం ఇంకా తేలలేదు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసులో విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఇక కీలక నేతలైప దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్) తమ వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని స్పీకర్ ను కోరారు.

ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో..ఇన్ డైరక్టుగా అసెంబ్లీలో మరింత బలపడినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది వ్యక్తిగతంగా పెద్ద విజయమే అని చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్ కు ఇది కోలుకోలేని దెబ్బ.దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దీనిని ప్రజాస్వామ్య హత్యగా, కాంగ్రెస్ కుట్రగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. స్పీకర్ రాజకీయ పక్షపాతంతో తీర్పు ఇచ్చారని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

తెలంగాణలో రాజకీయం ఇప్పుడు ‘ ఆ పార్టీ నేతలతో కూర్చోవడం అంటే ఆ పార్టీలోకి మారినట్లు కాదు’ అనే కొత్త సూత్రం చుట్టూ తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ముందు వచ్చిన ఈ తీర్పు పట్టణ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి. ఒకవేళ మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా క్లీన్ చిట్ పొందితే, బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా విషయంలో కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

BRS : బీఆర్ఎస్ కమ్ బ్యాక్ ప్లాన్‌ వర్కవుట్ అవుతుందా? ..ఆ ఒక్క అస్త్రంతో కాంగ్రెస్ కోటను ఢీకొట్టగలదా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button