Telangana: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. 12 ఏళ్ల తర్వాత కీలక మార్పులు!

Telangana: నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 12 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్‌లో కీలక మార్పులు చేస్తున్నామని వెల్లడించారు.

Telangana

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి.

నాంపల్లి (Telangana)ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 12 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్‌లో కీలక మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయం విద్యార్థులకు ముఖ్యమైనది, ఎందుకంటే:

ప్రాక్టికల్స్ (Labs) ఫస్ట్ ఇయర్‌కు కూడా.. ఈ కొత్త నిర్ణయంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ (మొదటి సంవత్సరం) లో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ల్యాబ్ ఎక్స్‌టర్నల్ మార్కులు 30 మార్క్స్ మొదటి సంవత్సరంలో కూడా తీసుకు వస్తున్నారు.

ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ప్రమాణాలు.. NCERT సూచనల ప్రకారం, సబ్జెక్టు కమిటీల సలహాలతో ఈ సిలబస్ మార్పులు చేస్తున్నామని సెక్రెటరీ తెలిపారు. ఈ ప్రక్రియను 40 నుంచి 45 రోజుల్లో పూర్తిచేస్తామని ఆయన చెప్పారు.

Telangana

కొత్త సిలబస్ అందుబాటు.. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం, డిసెంబరు 15 నాటికి సిలబస్‌ను తెలుగు అకాడమీకి అందిస్తారు. ఏప్రిల్ నెల చివరి నాటికి మారిన నూతన సిలబస్ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. నూతన సిలబస్‌తో పాటు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ (QR Code) ముద్రణ కూడా ఉండనుంది.

కొత్త గ్రూప్.. 2026 సంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ (ACE Group) గ్రూప్ ప్రారంభం అవుతుందని ఇంటర్ బోర్డు సెక్రెటరీ తెలిపారు.

పరీక్షల నిర్వహణ వివరాలు:
ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈసారి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. నవంబర్ 1 నుంచి ఎగ్జామ్ ఫీజు కలెక్షన్ ప్రారంభమవుతుందని బోర్డు ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version