Army rally
దేశానికి సేవ చేయాలనే కలలు కన్న యువతకు ఇంకోసారి ఆర్మీ(Army rally)లోకి అడుగుపెట్టే అద్భుత అవకాశం వచ్చింది. కాకినాడ(Kakinada) నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆగస్టు 5 నుంచి ఇండియన్ ఆర్మీ భారీ (Indian Army jobs)రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ప్రత్యేక శిక్షణ ర్యాలీ, రాష్ట్రంలోని 12 జిల్లాల యువత కోసం ఒక అరుదైన అవకాశంగా నిలవనుంది.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల్లో 15 వేలకు పైగా యువకులు ఫిజికల్ టెస్ట్ కోసం అర్హత సాధించారు. వీరు కాకినాడ రిక్రూట్‌మెంట్ సెంటర్ వద్ద అనుసంధానించబడిన మెగా ర్యాలీలో పాల్గొనబోతున్నారు.
ఈ ర్యాలీకి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాల యువతను ఎంపిక చేశారు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేవారికి అనేక శారీరక పరీక్షలు ఉండనున్నాయి. ముఖ్యంగా 1.6 కిలోమీటర్ల పరుగుతో ప్రారంభమయ్యే ఈ టెస్టింగ్‌లో మెడికల్ చెకప్, ఫిట్‌నెస్ పరీక్షలు, లాంగ్ జంప్, ఫుల్ ఆప్స్, 9 అడుగుల డిచ్ దాటడం, జిగ్ జాగ్ రన్నింగ్ వంటి పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బందోబస్తు, మెడికల్ సిబ్బంది, వాలంటీర్లు, పోలీస్ బలగాలు, రెస్క్యూ టీములు సిద్ధంగా ఉన్నాయి. మైదానంలో అభ్యర్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ ర్యాలీకి (Army rally)హాజరవుతున్న అభ్యర్థులు నిర్దిష్ట తేదీల్లో మాత్రమే మైదానానికి రావాలి. ఇతర జిల్లాల అభ్యర్థులు ముందుగా సమయ పట్టికను తెలుసుకొని రాలీకి హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
Also read: Upasana: మెగా కోడలుకు మెగా బాధ్యత..రేవంత్ కీలక నిర్ణయం