Phone tapping
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడెక్కుతోంది.బండి సంజయ్‌ను ప్రశ్నించనున్న సిట్, కేంద్ర నిఘా వర్గాల ఆధారాలతో బీజేపీ దూకుడుగా ముందుకు కదులుతోంది. తెలంగాణలో రాజకీయాలను తలకిందులుగా మార్చిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)స్కాంలో ఇప్పుడు కేంద్రం నుంచి సీరియస్ ఎంట్రీ కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నెల 8న సిట్ ఎదుట హాజరుకానున్నారు. సిట్‌కు ఆయన ఇప్పటికే లేఖ పంపారు. ఢిల్లీలో కేంద్ర నిఘా వర్గాలతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు ఆయన వద్దకు వచ్చాయని సమాచారం. వీటిని ఆయన విచారణ సమయంలో అధికారుల ముందుంచే అవకాశముంది.
ఈ ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)వ్యవహారం కేవలం రాజకీయ నేతలు, అధికారులకే పరిమితం కాలేదు. జడ్జీలు, బిజినెస్ మగ్నెట్లు, పలువురు జర్నలిస్టులతో పాటు… పలు ప్రైవేట్ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలు కూడా ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది అత్యంత గోప్యంగా ఉండాల్సిన పర్సనల్ లైఫ్‌పై నిఘా పెట్టిన ఘోరమైన ఉదాహరణగా బీజేపీ ఎత్తిపొడుస్తోంది.
ఇక ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్ వేసింది. కేంద్రానికి చెందిన నిఘా సంస్థలూ ఈ వ్యవహారంపై క్లారిటీగా కొన్ని వివరాలను సేకరించాయని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖతో కూడా బీజేపీ తెలంగాణ యూనిట్ కంటిన్యూగా సమన్వయం చేస్తోంది.
ముఖ్యంగా కేసులో ప్రధాన సూత్రధారి రాధాకృష్ణ రావు, మరో సీనియర్ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు(Prabhakar Rao statement) చెప్పిన విషయాలు కేసీఆర్, కేటీఆర్( KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే సంకేతాలను ఇస్తున్నాయి. పైగా ఇదంతా ఎన్నికల ముందునుంచి జరుగుతున్న మానిటరింగ్ వ్యవస్థ భాగంగా అమలైందన్న ఆరోపణలు బలపడుతున్నాయి.
ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) గతంలో తన ఫోన్ ట్యాపయ్యిందని పలు సమయాల్లో ప్రకటించారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారిక విచారణకు హాజరవుతూ, కేంద్రం చేతిలో ఉన్న పలు డాక్యుమెంట్లు, టెక్నికల్ ఆధారాలను చూపిస్తే… ఈ కేసులో కీలక మలుపు ఖాయం.
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(phone tapping case) కేవలం టెక్నికల్ స్కామ్‌గా కాకుండా… రాజ్యాంగంపై విరుచుకుపడిన కుట్రగా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక బండి సంజయ్ సిట్ ఎదుట ఏం చెబుతారు? కేంద్రం నుంచి ఏయే ఆధారాలు బయటకు వస్తాయి? కేసీఆర్, కేటీఆర్ రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నదానికి సమాధానం ఈ వారంలోనే తెలుస్తుంది.