Hi-Tech City Railway Station: కొత్త హబ్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్

Hi-Tech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేస్తున్న నయా భారత్ - నయా స్టేషన్

Hi-Tech City Railway Station

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (Amrit Bharat Station Scheme)లో భాగంగా ‘నయా భారత్ -నయా స్టేషన్’ కార్యక్రమం కింద ఈ ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ. 26.60 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. దీంతో అతి త్వరలో ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

గతంలో హైటెక్ సిటీ స్టేషన్(Hi-Tech City Railway Station) సాధారణ రైల్వే స్టేషన్ల మాదిరిగా పెద్దగా అత్యాధునిక సౌకర్యాలు లేకుండా ఉండేది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నాకూడా..దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు సరిపోయేవి కాదు. పార్కింగ్, లైటింగ్, ప్రవేశ మార్గాలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు అంతగా ఉండేవి కావు.

అయితే, పునర్‌వికాసం పనులు పూర్తయిన తర్వాత స్టేషన్ పూర్తిగా కొత్త రూపంలోకి రానుంది. అనవసరమైన నిర్మాణాలను తొలగించి, మెరుగైన లైటింగ్, విస్తృతమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటివి ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

Hi-Tech City Railway Station

ఈ ఆధునీకరణ వల్ల హైటెక్ సిటీ స్టేషన్ (Hi-Tech City Railway Station)కేవలం ఒక రైల్వే స్టేషన్‌గా కాకుండా, హైదరాబాద్‌కి ఒక మెయిన్ సెంటర్‌గా మారనుంది. స్టేషన్‌ను ఆధునిక శిల్పకళతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. దీనివల్ల స్టేషన్ కొత్త రూపాన్ని పొందుతుంది.

పర్యావరణహిత నిర్మాణమైన దీనిని.. భవనాన్ని గ్రీన్ ఎనర్జీ వినియోగంతో నిర్మిస్తున్నారు. ఇది పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణంగా నిలవనుంది. ప్రయాణికుల కోసం విస్తృతమైన సర్క్యులేటింగ్ ఏరియా, సురక్షితమైన పార్కింగ్ స్థలం, సులభమైన ప్రవేశ మార్గాలు అందుబాటులోకి వస్తాయి.

నగర హబ్‌గా హైటెక్ సిటీ హైదరాబాద్‌( Hyderabad)లో మల్కాజ్‌గిరి, హఫీజ్‌పేట్, బేగంపేట్ వంటి ఇతర స్టేషన్లలో కూడా పునర్‌వికాస పనులు జరుగుతున్నా కూడా.. హైటెక్ సిటీ స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఇది నగరంలోని ప్రధాన రైల్వే హబ్‌లలో ఒకటిగా మారి, రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తుంది.

Also Read: Kaleshwaram : బీఆర్ఎస్‌లో అరెస్టుల భయం.. కేసీఆర్ కీలక వ్యూహం ఏంటి?

Exit mobile version