Love Twice : ఒకే వ్యక్తితో రెండుసార్లు ప్రేమలో పడాలా? సైకాలజీ చెప్పే ఈ ప్రేమ రహస్యం ఏంటి?

Love Twice: రోజూ ఎక్కువ సేపు మాట్లాడటం, కలిసి తిరగడం వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియడం మొదలవుతుంది. ఆ సమయంలో.. ఎదుటి వ్యక్తి తాను అనుకున్నంత పర్ఫెక్ట్ గా లేరనే నిజాన్ని గ్రహిస్తారు.

Love Twice

నిజమైన ప్రేమ అంటే కేవలం మొదటి చూపులో పుట్టేది మాత్రమే కాదు. ఆ ఇద్దరు వ్యక్తులు అలాగే ఒక బంధంలో జీవితాంతం సంతోషంగా కలిసి ప్రయాణించాలంటే, వారు కచ్చితంగా రెండు సార్లు ప్రేమలో పడి తీరాల్సిందేనని సైకాలజీ చెబుతోంది.

ఒక వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు కలిగే లవ్ వేరు, ఆ తర్వాత ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కలిగే లవ్ వేరు. మరి ఈ రెండు రకాల ప్రేమల వెనుకున్న అసలైన సైకలాజికల్ రీజన్స్ ఏంటో, ఒక బంధం నిలబడటానికి ఈ రెండోసారి ప్రేమ(Love Twice)లో పడటం ఎందుకు అంత ముఖ్యమో సైకాలజిస్టులు వివరిస్తున్నారు.

ఒక వ్యక్తితో మొదటి చూపులోనో లేదా కొద్ది పరిచయం తర్వాతో ప్రేమలో పడటాన్ని సైకాలజీలో ఇన్‌ఫాచ్యుయేషన్ (Infatuation) లేదా రొమాంటిక్ ఫేజ్ అంటారు. ఈ స్టేజిలో ఎదుటివ్యక్తి అందం, వారి మాట్లాడే విధానం, వారి అలవాట్లు, మనలాగే ఉండే వారి అభిరుచులు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఆ సమయంలో వారి మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్లు విపరీతంగా రిలీజవుతూ ఉంటాయి.

దీనివల్ల అవతలి వ్యక్తిలో చిన్న చిన్న లోపాలున్నా కూడా అవేమీ వారికి కనిపించవు. తాను ప్రేమించిన వ్యక్తి చాలా పర్ఫెక్ట్ అని, మనకోసమే పుట్టారని ఒక అందమైన ఊహల ప్రపంచంలో బతికేస్తుంటారు.

కొంతకాలం గడిచాక, ఇద్దరి మధ్య పరిచయం మరింత దగ్గరతనం పెరిగే కొద్దీ అసలైన కథ మొదలవుతుంది. దీనిని సైకాలజీలో రియాలిటీ ఫేజ్ (Reality Phase) అంటారు. రోజూ ఎక్కువ సేపు మాట్లాడటం, కలిసి తిరగడం వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియడం మొదలవుతుంది. ఆ సమయంలో.. ఎదుటి వ్యక్తి తాను అనుకున్నంత పర్ఫెక్ట్ గా లేరనే నిజాన్ని గ్రహిస్తారు.

కొన్ని విషయాల్లో అభిప్రాయాలు కలవకపోవడం, మొదట్లో మెచ్చుకున్న అలవాట్లలో కొన్ని నచ్చకపోవడం, చిన్న చిన్న గొడవలు జరగడం వంటివి ఈ దశలోనే ఎదురవుతాయి. అందుకే చాలా మంది ప్రేమ జంటలు రానురాను ఈ లోపాలను తట్టుకోలేక, తాము అనుకున్నది ఇది కాదని ఇక్కడే విడిపోవడానికి నిర్ణయించుకుంటారు.

అయితే ఎవరైతే ఈ నిజాలను, ఎదుటివారిలోని లోపాలను చూసి వెనకడుగు వేయకుండా ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారో.. వారు మాత్రమే తమ బంధంలో నెక్స్ట్ స్టేజికి చేరుకుంటారు. లోకంలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్ గా ఉండరనే నిజాన్ని హృదయ పూర్వకంగా అంగీకరిస్తారు.

ఎదుటివారిలో తమకు కొన్ని నచ్చని అలవాట్లు ఉన్నా సరే.. వాటన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ, వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అదే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడతారు. ఈ రెండోసారి కలిగే ప్రేమనే సైకాలజీలో మెచ్యూర్ లవ్ (Mature Love) లేదా అటాచ్మెంట్ ఫేజ్ అని అంటారు.

Love Twice:

కేవలం ఎదుటివారిలోని మంచిని, అందాన్ని, వారి అభిరుచులను చూసి మొదటి ప్రేమ పుడితే.. వారిలోని లోపాలను, బలహీనతలను కూడా స్వీకరిస్తూ కూడా ఈ రెండో ప్రేమ పుడుతుంది. ఈ దశకు చేరుకున్న బంధాలే చివరి వరకూ చాలా బలంగా ఉంటాయి.

కాలంతో పాటు వచ్చే ఎలాంటి తుపానులనైనా తట్టుకుని జీవితాంతం ఒకరికోసం ఒకరు అన్నట్లుగా నిలబడతారు. అందుకే, ప్రతి విజయవంతమైన ప్రేమ కథ వెనుక కూడా ఒకే వ్యక్తితో రెండు సార్లు ప్రేమ(Love Twice)లో పడిన ఒక అందమైన నిజం దాగి ఉంటుందని సైకాలజీ చెబుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version