Not Served With Love
మనం ఎంత కష్టపడినా మూడు పూటలా కాస్త పొట్ట నింపుకోవడానికే అని అందరికీ తెలుసు. కానీ మనం తినే ఫుడ్ కేవలం కడుపు నింపడమే కాదు, మన మనస్సును, మన శరీరంలోని శక్తిని కూడా పూర్తిగా మార్చేస్తుందన్న విషయం మాత్రం చాలామందికి తెలీదు. మనం వండుకునే ఆహారం లేదా మనకి వడ్డించే భోజనం వెనుక ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ మన లైఫ్‌ను ఏ రేంజ్‌లో ఎఫెక్ట్ చేస్తాయో తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
కలుషితమైన ఆహారాన్ని కానీ, మనస్సులో విషం పెట్టుకుని మనకు ఫుడ్ వడ్డించే వారిలో వారికే తెలీని ఓ రాక్షసత్వం దాగి ఉంటుందని మానసిక నిపుణులు అలాగే ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. బయటకి మనుషుల్లా పద్ధతిగా కనిపిస్తున్నా.. లోపల శత్రుత్వంతో నిండిపోయిన వారి మెంటాలటీ నిజంగా చాలా డేంజర్ అని చెబుతున్నారు.
మనం ఒకరికి ఆహారం పెట్టినప్పుడు కానీ చివరకు వంట చేసినపుడు కూడా మన మనస్సులో ఎలాంటి ఆలోచనలుంటాయో, ఆ ఆలోచనలు ఆ తిండి(Not Served With Love) ద్వారా ఎదుటి వ్యక్తికి శాపంగా, గొప్ప ఆశీర్వాదంగా మారిపోతాయి. మీరు మంచి మనస్సుతో, స్వచ్ఛమైన ప్రేమతో ఒక ముద్ద అన్నం పెట్టినా అది అవతలి వారికి ఆశీర్వాదమై వాళ్ల జీవితంలో శుభాలను తెచ్చిపెడుతుంది.
అదే మీరు లోపల తిట్టుకుంటూ, అసూయ పడుతూ, ఎదుటి వారిపై శత్రుత్వాన్ని నింపుకుని బయటకు నవ్వులు చిందిస్తూ భోజనం పెడితే(Not Served With Love) మాత్రం అది తిండి కాదని అది విషంతో సమానమని మన పెద్దలు కూడా చెబుతుంటారు.
అటువంటి ఆహారాన్ని తిన్నవాళ్లకు కచ్చితంగా చెడు జరుగుతుంది. అందుకే ఎవరి ఇళ్లలో పడితే వారింట్లోనూ, అక్కడ, ఎక్కడ బడితే అక్కడ తినకూడదని పూర్వం చెప్పేవారు. ఎప్పుడైనా సరే మన ఇంట్లో కాకుండ బయట ఎక్కడ తిన్నా కూడా తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు పక్కాగా ఆలోచించుకోవాలి.
ప్రేమ లేని చోట, మనల్ని ద్వేషించేవాళ్ల ఇంట్లో భోజనం చేయడం అసలు మంచిది కాదు. ఎక్కడైతే ప్రేమానురాగాలు ఉండవో, అక్కడ చిన్న ఎంగిలి కూడా పడకూడదు. చివరికి వారిచ్చిన మంచి నీళ్లు కూడా తాగకూడదు.
ఎందుకంటే మనం తాగే వాటర్‌లోకి కూడా ఎదుటివారి నెగటివ్ ఎనర్జీస్ చాలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. నెగటివ్ వైబ్స్ ఉన్న వాటర్‌ను, తిండిని మనం తీసుకుంటే, మనలో పాజిటివ్ ఎనర్జీ పోయి.. ఆ చెడు ఎనర్జీ మనలోకి ప్రవేశించి మనల్ని కూడా మార్చేస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఎదగనీయకపోవడం, అనారోగ్యం పాలవడం వంటివి జరుగుతాయి.
అందుకే ఎప్పుడైనా కూడా ప్రశాంతత, ప్రేమ ఉన్న చోట మాత్రమే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. మీరు కూడా మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారికి ప్రేమతో మనసారా ఆహారాన్ని అందించండి.
