NTR Neel : ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ హీరో…ప్రశాంత్ నీల్ ఎవరిని దించుతున్నాడో తెలుసా ?

NTR Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ వంటి సినిమాలతో హీరోయిజాన్ని సరికొత్తగా ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనకే సొంతం

NTR Neel

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ వంటి సినిమాలతో హీరోయిజాన్ని సరికొత్తగా ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనకే సొంతం. అలాంటి డైెరెక్టర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జత కడితే వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్(NTR Neel )కాంబినేషన్ లో డ్రాగన్ మూవీ వస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా సంచలన అప్ డేట్ వచ్చింది. డ్రాగన్ మూవీ నుంచి టొవినో థామస్ తప్పుకున్నారు.

ఈ విషయం ఆయనే అధికారికంగా వెల్లడించారు. దీంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై గత కొన్ని రోజులుగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెరపడింది. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలివేషన్లు, కటౌట్, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోనే హీరోయిజం చూపిస్తారు. ఆయన మూవీస్ లో హీరో ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తాడో విలన్ కూడా అంతకుమించి అనిపించేలా ఉంటాడు.

అందుకే ముందు ఎన్టీఆర్ కు ప్రతినాయకుడి పాత్ర కోసం టొవినో థామస్ తీసుకున్నారు. ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి టొవినో థామస్ తప్పుకోవడంతో ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు ప్రశాంత్ నీల్(NTR Neel )బాలీవుడ్ హీరోని బరిలోకి దించుతున్నారు. థామస్ ప్లేస్ ను బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రీప్లేస్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే షాహిద్ కపూర్ తో చర్చలు జరిగాయని, భారీ ప్రాజెక్ట్ కావడంతో షాహిద్ కపూర్ డేట్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సౌత్ మూవీస్ తో చాలా మందికి పేరొచ్చింది. ఇక్కడి డైరెక్టర్లతో పనిచేసేందుకు బాలీవుడ్ నటులు కూడా ఆసక్తిగా ఉంటున్నారు. అందుకే ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే షాహిద్ కపూర్ ఒకే చెప్పినట్టు సమాచారం.

NTR Neel

దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.ఇదిలా ఉంటే డ్రాగన్ మూవీపై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారంలో వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. భారీ యాక్షన్ సీన్స్ ఉండడంతో… ప్రతి షెడ్యూల్ మధ్యలో కొంత సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ఊరమాస్ అవతారంలో కనిపించనుండగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 వేసవిలో విడుదల కానుంది.

Mrunal Thakur : తెలుగింటి కోడలు అయిపో…మృణాల్ ను దీవించిన అల్లు అరవింద్

Exit mobile version