Mrunal Thakur : తెలుగింటి కోడలు అయిపో…మృణాల్ ను దీవించిన అల్లు అరవింద్
Mrunal Thakur : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది
Mrunal Thakur
అడివి శేష్, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. షానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
దీనికి డైరెక్టర్లు నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్ , బన్నీవాసు, స్వప్నదత్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మృణాల్ ఠాకూర్ పై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. డెకాయిట్ చిత్రానికి పనిచేసిన టాలెంటెడ్ టీమ్ ను చూసి చాలా గర్వంగా ఉందన్నారు.
సుప్రియను కలిసినప్పుడల్లా ఏం చేస్తున్నావంటూ అడుగుతానని, తన కష్టాలు చెబుతుంటుందని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని చెప్పారు. అడివి శేష్ కూడా మూవీ హిట్ అయ్యేవరకూ కష్టపడతాడని ప్రశంసించారు.
ఇదే క్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ను అల్లు అరవింద్ ఆకాశానికెత్తేశారు. తాను గతంలో నటించిన సీతారామంలో సీతగా అద్భుతంగా యాక్ట్ చేసిందన్నారు. అంతకు మించిన నటనను ప్రదర్శించే అవకాశం ఆమెకు మళ్లీ రాదనుకున్నానని, కానీ డెకాయిట్ ఆ లోటు తీర్చిందని కితాబిచ్చారు. ఎమోషనల్ సన్నివేశాల్లో వేరియేషన్స్ అద్భుతంగా చూపించిందని ప్రశంసించారు.

అయితే ఈ సందర్భంగా అల్లు అరవింద్ మృణాల్ పెళ్లి గురించి మాట్లాడడం వైరల్ గా మారింది. గతంలో ఇలాంటి సినిమా వేదికపైనే ఒక అమ్మాయిని దీవిస్తే ఏకంగా మెగా ఇంటికి కోడలైపోయిందంటూ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి గుర్తు చేశారు. ఇప్పుడు మృణాల్ ను కూడా దీవిస్తున్నాననీ, ఆమె లానే తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
మృణాల్ ను ఇక్కడే ఉంచడానికి ఇదొక్కడే మార్గమంటూ అల్లు అరవింద్ చమత్కరించారు. అల్లు అరవింద్ తన పెళ్లి గురించి ఈ కామెంట్స్ చేసినప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా తెగ సిగ్గుపడిపోయింది. లావణ్య త్రిపాఠీ విషయంలో అల్లు అరవింద్ మాట నిజమైంది కాబట్టి మృణాల్ కూడా తెలుగుంటికి కోడలు అయిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
Hormuz :హర్మూజ్ దిగ్బంధం దిశగా అమెరికా..భారత్‌పై చమురు ధరల ప్రభావం ఎంత?





