Soaked Almonds Benefits
కరోనా తర్వాత చాలామందిలో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరిగింది. దీంతో చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. వీటిలో ముఖ్యంగా బాదం (Almond ) పప్పులు తింటున్నారు.
అయితే వాటిని నేరుగా తినడం కంటే, రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినాలి. అది కూడా బాదంపప్పు (SOaked Almonds )పొట్టు తీసి తినడం వల్ల కలిగే లాభాలు రెట్టింపవుతాయి. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.
బాదం పప్పు పొట్టులో టానిన్ (Tannin) అనే ఎంజైమ్ ఇన్హిబిటర్ ఉంటుంది. ఇది బాదంలోని పోషకాలను మన బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. బాదంను నానబెట్టినప్పుడు ఆ పొట్టు ఈజీగా విడిపోతుంది.
పొట్టు తీసిన బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరానికి నేరుగా అందుతాయి. నానబెట్టిన బాదం పప్పులు జీర్ణమవ్వడం కూడా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచడంలో బాదం (Almond) పప్పు అగ్రస్థానంలో ఉంటుంది. దీనిలోని ‘రిబోఫ్లావిన్’, ‘ఎల్-కార్నిటైన్’ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
బరువు తగ్గాలనుకునే వారెవరెయినా సరే పరగడుపున 4-5 నానబెట్టిన బాదం పప్పులు తింటే, ఆకలి తక్కువగా వేస్తుంది, శక్తి లభిస్తుంది. చర్మం మెరిసిపోవడానికి, జుట్టు దృఢంగా ఉండటానికి కూడా బాదం పప్పులోని పోషకాలు తోడ్పడతాయి. రోజువారీ ఆహారంలో ఇదొక చిన్న మార్పు అయినా, ఇచ్చే ఫలితాలు మాత్రం అద్భుతం.
Soaked Almonds Benefits : పరగడుపున నానబెట్టిన బాదం తింటే ఇన్ని లాభాలా?
