Blue City :పర్యాటక స్వర్గంగా బ్లూ సిటీ..ఎక్కడో కాదు ఇండియాలోనే..

Blue City :ఈ నగరం ఎటు చూసినా నీలి రంగులో నిగనిగలాడుతూ, ఒక అద్భుతమైన చిత్రాన్ని తలపిస్తుంది.

Blue City

నీలి అందాల నగరంలో మీరు కూడా మునిగిపోవాలని ఉందా? ప్రపంచంలోనే ఏకైక ‘బ్లూ సిటీ’ మన ఇండియాలోనే ఉంది.భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే ఏకైక బ్లూ సిటీగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం ప్రసిద్ధి చెందింది. ఈ నగరం ఎటు చూసినా నీలి రంగులో నిగనిగలాడుతూ, ఒక అద్భుతమైన చిత్రాన్ని తలపిస్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ అపురూపమైన అందాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. ఇక్కడి జీవనం, భోజనం, ప్రయాణం అన్నీ చాలా తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అందుకే, పర్యాటక ప్రియులకు ఇది ఒక స్వర్గధామంలాంటిది.

జోధ్‌పూర్ నగరం సుమారు 650 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని చరిత్ర చెబుతోంది. 1459లో రాథోడ్ వంశానికి చెందిన రావ్ జోధా రాజ్ పుత్ దీనిని నిర్మించారు. మొదట ఒక ఎత్తైన కొండపై ఈ నగరాన్ని నిర్మించినప్పటికీ, జనాభా పెరిగే కొద్దీ లోతట్టు ప్రాంతాల్లో కూడా నీలిరంగు ఇళ్లతో (Blue City)విస్తరించారు. అందుకే ఈ నగరం అంతటా బ్లూ కలర్ భవనాలే దర్శనమిస్తాయి. ఈ ప్రత్యేకత వల్ల దీనిని ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా'(Blue City)అని పిలుస్తారు.

జోధ్‌పూర్ కేవలం నీలిరంగు(Blue City) ఇళ్లతోనే కాదు, అనేక చారిత్రక కట్టడాలు, రాజభవనాలు, కోటలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రతి అణువులోనూ రాజసం, సంస్కృతి ఉట్టిపడుతుంది. ఈ నగరాన్ని సందర్శించేవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఉమైద్ భవన్ ప్యాలెస్(Umaid Bhawan Palace).. రాజస్థాన్‌లోని అతిపెద్ద ప్యాలెస్‌లలో ఒకటి. ఈ భవనం నిర్మాణశైలి ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది.

జస్వంత్ థాడా(Jaswant Thada).. తెల్లటి పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఒక రాజపుత్ రాజ సమాధి. దీనిని రాజస్థాన్ తాజ్‌మహల్ అని పిలుస్తారు.

blue city

క్లాక్ టవర్.. నగరం మధ్యలో ఉన్న ఈ క్లాక్ టవర్ జోధ్‌పూర్ యొక్క పాత సంస్కృతికి చిహ్నం. దీని చుట్టూ ఉండే మార్కెట్ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.

మాండోర్ గార్డెన్, కైలానా, బాల్సమండ్ సరస్సులు.. ఈ అందమైన తోటలు, ప్రశాంతమైన సరస్సులు నగర సందడి నుంచి ఉపశమనం పొందడానికి మంచి ప్రదేశాలు.

మసూరియా హిల్స్, రతనాడ గణేష్ ఆలయం, వీర్ దుర్గాదాస్ స్మారక చిహ్నం.. ఈ ప్రాంతాలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

మచియా బయోలాజికల్ పార్క్, రావు జోధా ఎడారి రాక్ పార్క్.. ఈ ప్రదేశాలు ప్రకృతి, వన్యప్రాణులను ఇష్టపడే వారికి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.

జోధ్‌పూర్ అంటే కేవలం ఒక నీలిరంగు నగరం(Jodhpur Blue City) కాదు, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి కలబోసిన ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ నగరం చూసిన ప్రతి ఒక్కరూ ఆ అందాలకు మంత్రముగ్ధులైపోతారు.

 

Exit mobile version