Affectionate Aggression : ప్రేమతో కొరకడం, గిచ్చడం ఎందుకు చేస్తాం? అఫెక్షనేట్ అగ్రెషన్ వెనుకున్న సైకాలజీ ఏంటి?

Affectionate Aggression : ప్రేమను చూపించాల్సిన చోట ఈ కొరకడం, గిచ్చడం, నలపడం వంటి పనులు ఎందుకు చేస్తుంటారనే ప్రశ్న చాలామందిలో వస్తుంది.

Affectionate Aggression

కొంతమంది ఎవరైనా ముద్దుగా ఉన్న చిన్న బాబో, పాపో కనిపిస్తే చాలు..వెంటనే ఆ బుగ్గలు గట్టిగా నొక్కేస్తుంటారు . మరికొంతమంది అయితే బాగా నచ్చిన పెట్ డాగ్, క్యాట్ కనిపిస్తే గట్టిగా నలిపేసి హగ్ చేసుకుంటారు. అంతెందుకు, లవర్స్, పార్ట్‌నర్‌ల మధ్య కూడా విపరీతమైన ప్రేమ గుర్తొచ్చినప్పుడు గట్టిగా కొరకడమో, గిచ్చడమో చేస్తుంటారు.

అయితే ప్రేమను చూపించాల్సిన చోట ఈ కొరకడం, గిచ్చడం, నలపడం వంటి పనులు ఎందుకు చేస్తుంటారనే ప్రశ్న చాలామందిలో వస్తుంది. అసలు ప్రేమకు, ఈ అగ్రెషన్‌కు లింక్ ఏంటి అంటే ..ఈ ఫీలింగ్‌ను సైకాలజీ భాషలో అఫెక్షనేట్ అగ్రెషన్ (Affectionate Aggression) లేదా క్యూట్ అగ్రెషన్ అంటారు. వినడానికి వింతగా ఉన్నా.. దీని వెనుక ఒక అద్భుతమైన మైండ్ గేమ్ దాగి ఉందట.

సాధారణంగా మన మనసు తట్టుకోలేనంత సంతోషానికో, విపరీతమైన ప్రేమకో లోనైనప్పుడు, మన బ్రెయిన్ ఆ ఎమోషన్‌ను కంట్రోల్ చేయడానికి దానికి రివర్స్ ఉండే ఇంకో ఎమోషన్‌ను బయటకు తీస్తుంది. దీన్నే సైంటిఫిక్ టర్మ్స్‌లో డైమార్ఫస్ ఎక్స్‌ప్రెషన్ అంటారు.

ఉదాహరణకు.. మనకు పట్టరాని సంతోషం వేసినప్పుడు కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయి. అలాగే విపరీతమైన బాధ కానీ భయం కానీ వేసినప్పుడు కొందరు పిచ్చిగా నవ్వేస్తుంటారు.

సేమ్ టు సేమ్, ఎవరినైనా చూసినప్పుడు గుండెల్లో ప్రేమ పొంగిపొర్లితే.. ఆ ఎమోషనల్ ఓవర్‌లోడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, బ్రెయిన్ వెంటనే దానికి ఆపోజిట్ అయిన అగ్రెషన్ అంటే కోపాన్ని లేదా హింసను మిక్స్ చేస్తుంది.

ఆ ప్రేమను బ్యాలెన్స్ చేయడానికే గట్టిగా గిచ్చడం, కొరకడం వంటివి మనకు తెలీకుండానే చేసేస్తాం. పార్ట్‌నర్స్ మధ్య కనిపించే లవ్ బైట్స్ వంటివి దీనిలో భాగమే.

ఇక్కడే మనం ఒక విషయాన్ని పక్కాగా గుర్తు పెట్టుకోవాలి. అఫెక్షనేట్ అగ్రెషన్‌(Affectionate Aggression)లో కనిపించే కోపం కానీ హింస వెనుక కానీ అవతలి వాళ్లను బాధపెట్టాలనే బ్యాడ్ ఇంటెన్షన్ అస్సలు ఉండదు.

ఎదుటి వ్యక్తిపై తమకున్న అమితమైన ఇష్టాన్ని, ప్రేమను ఆ సమయంలో ఎలా వ్యక్తపరచాలో తెలియక మన మెదడు నుంచి వచ్చే ఒక రియాక్షన్ మాత్రమే అది అని తెలుసుకోవాలి.

సైకాలజిస్టుల రీసెర్చ్ ప్రకారం.. ఈ క్యూట్ అగ్రెషన్ అనేది మన మైండ్ మళ్లీ నార్మల్ పొజిషన్‌కి రావడానికి సాయం చేస్తుంది. ఆ సమయంలో అలా గట్టిగా గిచ్చడమో, కొరకడమో చేయకపోతే.. ఆ విపరీతమైన ఎమోషన్ వల్ల బ్రెయిన్ కాస్త అయోమయానికి గురయిపోతుంది.

అయితే ఈ ఫీలింగ్ అందరిలోనూ ఉండదు. ఎమోషన్స్ ఎక్కువగా ఉండే వారిలోనూ, చిన్న విషయాలకే బాగా ఎగ్జైట్ అయిపోయే వారిలోనూ ఈ అఫెక్షనేట్ అగ్రెషన్(Affectionate Aggression) చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

Affectionate Aggression

ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న పార్ట్‌నర్స్ మధ్య, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు, లేదా పెంపుడు జంతువులను ఎక్కువగా ప్రేమించే వాళ్లలో ఈ బిహేవియర్ పీక్స్‌లో ఉంటుంది.

కాబట్టి, నెక్స్ట్ టైమ్ మీ పార్ట్‌నర్ మిమ్మల్ని చూసి ప్రేమతో గిల్లితేనో.. లేదంటే క్యూట్ బేబీని చూసి మీకే వారి బుగ్గలు నలిపేయాలనిపిస్తేనో ఆలోచనల్లో పడకండి. అది మీ లోపల ఉన్న లవ్‌ని బ్యాలెన్స్ చేయడానికి.. మీ బ్రెయిన్ మీతో ఆడుతున్న ఒక చిన్న సైకలాజికల్ గేమ్ మాత్రమే అని తెలుసుకోండి.

Mccullum : బజ్‌బాల్ శకానికి ముగింపు..టెస్ట్ కోచ్‌గా తప్పుకున్న మెక్‌కల్లమ్

Exit mobile version