Cabbage Storage
బయట వర్షాలు పడుతున్నాయంటే చాలు కూరగాయలు నిల్వ చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది. గాలిలో హ్యుమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల క్యాబేజీ వంటి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు చాలా వేగంగా మెత్తబడిపోవడం, బూజు పట్టడం, ఆకుల మధ్య నీరు చేరి కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే క్యాబేజీని ఫ్రెష్‌గా దాచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
మొదటగా మనం మార్కెట్‌లో కొనేటప్పుడే చూసి మంచిది ఎంచుకోవాలి. తేలికగా ఉండేవి కాకుండా గట్టిగా బరువుగా ఉండి, ఆకులు టైట్‌గా ఉన్న క్యాబేజీని మాత్రమే కొనాలి. బయట ఆకులు నల్లగా, పురుగులు పట్టినట్లుగా, పసుపు రంగులోకి మారినట్లు ఉన్నవాటిని అస్సలు కొనకూడదు.
చాలామంది క్యాబేజీని ఇంటికి తీసుకురాగానే నీళ్లతో శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ఇలా చేస్తే ఆకుల మధ్య నీళ్లు ఉండిపోయి, ఫంగస్ చేరి త్వరగా కుళ్లిపోతుంది. కడిగి బాగా ఆరబెట్టాక మాత్రమే ప్రిడ్జ్‌లో పెట్టాలి. లేదంటే వండే ముందు కడిగినా సరిపోతుంది.
క్యాబేజీని ప్రిడ్జ్‌లో పెట్టే ముందు(Cabbage Storage) దెబ్బతిన్న బయటి ఆకులన్నిటినీ తీసేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక టిష్యూ పేపర్ లేదా పేపర్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లోని వెజిటబుల్ బాక్స్‌లో పెట్టాలి. కాగితం క్యాబేజీలో ఉండే ఎక్స్‌ట్రా తేమను పీల్చేస్తుంది.
ఒకవేళ మీరు క్యాబేజీని సగం కోసి వాడినట్లయితే మిగిలిన భాగాన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి వెంటనే ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఒకవేళ తురిమిన క్యాబేజీని నిల్వ చేయాలంటే, డబ్బా అడుగున పేపర్ టవల్ వేసి దానిపై క్యాబేజీ తురుము వేసి మూత టైట్‌గా పెట్టాలి. పేపర్ తడిస్తే వెంటనే(Cabbage Storage) దానిని మారుస్తూ ఉండాలి.
క్యాబేజీ ఆకులు జిగటగా మారినా, స్మెల్ వచ్చినా ,నల్లటి మచ్చలు వచ్చినా దానిని వాడకపోవడమే మంచిది. ఎప్పుడూ కూడా అవసరానికి మించి ఎక్కువగా కూరగాయలు కొనేసి వేస్ట్ చేసుకోవడం కంటే, తక్కువ పరిమాణంలో కొనుక్కోవడమే తెలివైన పని అని గుర్తు పెట్టుకోవాలి.
Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్‌స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?
