Children Mistakes
ఈరోజుల్లో పిల్లలను పెంచడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పటి జనరేషన్ కిడ్స్ ఒకప్పటి పిల్లల కంటే కూడా చాలా షార్ప్ అండ్ అడ్వాన్స్‌డ్. ఒక్కసారి ఏదైనా చూస్తే చాలు, స్పాంజ్ లాగా దాన్ని పీల్చేసుకున్నట్లే అన్నీ గ్రహిస్తున్నారు. ఇప్పటి కిడ్స్ బ్రెయిన్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందంటే.. మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా సైలెంట్‌గా గమనిస్తూనే ఉంటున్నారు.
అయితే ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే మెచ్యూరిటీ వాళ్లకు ఉండదు కాబట్టి, మనం ఏం చేస్తే దాన్నే తమ రొటిన్‌గా మార్చేసుకుంటున్నారు. అందుకే తమ పిల్లలు తమ మాట వినడం(Children Mistakes) లేదని బాధపడే ముందు, అసలు మనల్ని చూసి వాళ్లు ఏం నేర్చుకుంటున్నారనే క్వశ్చన్ పేరెంట్స్ తమను తాము వేసుకోవాలని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఇంట్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారని రోజూ వర్రీ అయిపోతుంటారు. కానీ అదే టైమ్‌లో పేరెంట్స్ కూడా మొబైల్ పట్టుకుని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే పిల్లలకి బ్రెయిన్‌లో .. అమ్మానాన్నలు రోజూ చూస్తున్నారు కదా, నేనెందుకు చూడకూడదనే థాట్ వాళ్లలో స్ట్రాంగ్ అవుతుంది.
అలాగే ఎవరైనా ఫోన్ చేసినప్పుడో, మాట్లాడినపుడో మన పక్కనే పిల్లలను పెట్టుకుని చిన్న చిన్న అబద్ధాలు స్మూత్‌గా చెప్పేస్తుంటారు కొంతమంది. ఇది వారి దృష్టిలో అది లైట్ మేటరే కావచ్చు, కానీ పిల్లల మైండ్‌లో ఓహో.. అవసరానికి అబద్ధం ఆడటం కరెక్ట్ అనే ఆలోచన ప్రింట్ అయిపోతుంది.
ఇంట్లో చిన్న ప్రాబ్లెమ్ వచ్చినా గట్టిగా అరవడం, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డుపై ఇతరులపై అరిచేయడం వంటివి చేస్తే.. పిల్లలు కూడా తమ కోపాన్ని అలాగే ఎక్స్‌ప్రెస్ చేయాలని ఫిక్స్ అవుతారు.పనివాళ్లతో, తక్కువ అంతస్తు ఉన్నవారితో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఎప్పుడూ కూడా తమ స్థాయి కంటే చిన్నవారికి గౌరవం ఇవ్వకూడదన్న ఫీలింగ్ బలంగా నాటుకుపోతుంది.
టైమ్‌కి తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, లేట్ నైట్ వరకు నిద్రపోకపోవడం, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లేకపోవడం వంటి పద్ధతులు ఉంటే పిల్లలకు అవే అలవాటవుతాయి. అందుకే ఇంట్లో పిల్లల ముందున్నప్పుడు పేరెంట్స్ చాలా అంటే చాలా కాన్షియస్‌గా ఉండాలి.
ఫోన్ వాడకాన్ని తగ్గించడం, బాధ్యతగా నడుచుకోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, తప్పు జరిగితే ఈగో లేకుండా ఒప్పుకోవడం వంటివి ప్రాక్టికల్ చేసి చూపిస్తేనే పిల్లలు మంచి దారిలో నడుస్తారు. ఇంటి వాతావరణమే పిల్లలకు ఫస్ట్ స్కూల్ కాబట్టి, మనం మాటలతో చెప్పడం కంటే ఆచరణలో చూపే రోల్ మోడలే బెస్ట్ అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
PAN Card Name Change : పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి
