Relief On Power Charges : కరెంట్ ఛార్జీలపై ఊరట..వినియోగదారుల ఖాతాల్లోకి ట్రూడౌన్ డబ్బులు..
Relief On Power Charges : 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను ఏకంగా రూ.629 కోట్లను ట్రూడౌన్ చేయడానికి పచ్చజెండా ఊపింది.
Relief On Power Charges
కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే ఈ రోజుల్లో.. ఏపీ విద్యుత్ వినియోగదారుల ముఖాలలో చిరునవ్వే తెచ్చే కమ్మటి వార్త బయటికొచ్చింది. జనరల్‌గా ప్రతీసారి కరెంట్ బిల్లుల్లో ట్రూఅప్ భారం పడటం, జేబులకు చిల్లులు పడటం మనందరికీ అనుభవమే. కానీ ఈసారి ఈ సీన్ రివర్స్ అయింది.
కరెంట్ ఛార్జీలు పెరగడం కాదు అదే కరెంట్ బిల్లుల్లో డిస్కౌంట్(Relief On Power Charges) రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) తమ నిర్వహణ వ్యయంను తగ్గించుకోవడంతో పాటు ఫైనాన్సియల్ డిసిప్లిన్‌ను పాటించడంతో ఈ అరుదైన విజయం సాధ్యమైంది. దీనివల్లే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఈసారి వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ ఆఫర్‌వంటి ట్రూడౌన్ డిస్కౌంట్‌ని అందించడానికి రంగం సిద్ధం చేసింది.
ఈ గుడ్‌న్యూస్‌కు సంబంధించి ఏపీ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) తాజాగా ఒక ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను ఏకంగా రూ.629 కోట్లను ట్రూడౌన్ చేయడానికి పచ్చజెండా ఊపింది. ఈ భారీ మొత్తాన్ని రాబోయే రోజుల్లో కస్టమర్లకు వచ్చే పవర్ బిల్లుల్లో డైరెక్టుగా అడ్జస్ట్ చేయాలని డిస్కంలకు క్లియర్‌గా సూచనలు ఇచ్చింది.

అయితే పోయిన ఫైనాన్షియల్ ఇయర్ (2024-25)లో కూడా ఏపీ ప్రభుత్వం రూ.924 కోట్లను ఇప్పటికే ట్రూడౌన్ చేసింది. దానివల్ల ఇప్పుడు వాడే ప్రతీ ఒక్క పవర్ యూనిట్‌పై 13 పైసల చొప్పున డిస్కంలు బిల్లుల్లో డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇలా వరుసగా రెండేళ్ల లెక్కలను చూసుకుంటే.. సుమారు రూ.1,553 కోట్ల భారీ ధనాన్ని ప్రజలకే తిరిగి ఇచ్చేస్తూ వస్తున్నారన్న మాట . ఈ ఊరట కేవలం ఇంటి వినియోగదారులకే కాకుండా, వ్యాపారులు, ఇండస్ట్రీలు నడిపే ప్రతి ఒక్కరికీ పెద్ద ఆర్థిక వెసులుబాటుగా మారింది.
సాధారణంగా విద్యుత్ సంస్థలు తాము అనుకున్న వాటికంటే ఖర్చులు ఎక్కువైతే ట్రూఅప్ పేరుతో ఆ భారాన్ని కస్టమర్లపై వేసి అదనపు బాదుడు పేరుతో వసూలు చేస్తారు. కానీ నిర్వహణ ఖర్చు తగ్గడంతో, ఆ మిగిలిన డబ్బులను ట్రూడౌన్ రూపంలో కస్టమర్లకే తిరిగి డిస్కౌంట్(Relief On Power Charges) రూపంలో ఇచ్చేస్తున్నారు.
Liking Gap : మాట్లాడాక అయ్యో తప్పు మాట్లాడేసానా అని ఫీలవుతున్నారా? ఇది మీ మైండ్ చేసే మైండ్ గేమ్





