Avakaya : ఆవకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? నిల్వ చేయడానికి ఇంకా చాలా పద్ధతులున్నాయ్..

Avakaya: రూమ్ టెంపరేచర్ వద్ద ఊరగాయ ఉంచినప్పుడే అందులో ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ జరిగి .. మన బాడీకి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ తయారవుతాయి.

Avakaya

తెలుగువారి ఇంట్లో ఎన్ని రకాల వంటకాలున్నా, చివరగా ఒక్క ముద్ద ఆవకాయ(Avakaya)తో కలిపిన అన్నం తిన లేదంటే ఆ భోజనం పూర్తి కాదన్న ఫీలింగ్‌ ఉంటుంది. అమ్మ ప్రేమ, ఆవకాయ రుచి ఎప్పటికీ బోర్ కొట్టవనే డైలాగ్ సినిమాల్లోనూ తెగ వాడేసుకుంటారంటేనే దీని వ్యాల్యూ అర్ధం చేసుకోవచ్చు .

వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతీ తెలుగు వారి ఇళ్లలో ఆవకాయ(Avakaya) పండగ మొదలవుతుంది. మాగాయ, ఆవకాయ, పెసరావకాయ, తీపి ఆవకాయ అంటూ రకరకాల పచ్చళ్లను జాడీల్లో నింపి ఏడాది పొడవునా భద్రపరుచుకుంటూ ఉంటారు.

అయితే ఆధునిక కాలంలో వస్తున్న మార్పుల వల్ల ఈ పాతకాలపు రుచులను మనం తెలియకుండానే పాడు చేస్తున్నాం. ముఖ్యంగా ఆవకాయను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని అసలు రుచి, ఆరోగ్య ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని నిపుణులు అంటున్నారు.

నిజానికి ఆవకాయ తయారీ వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంటుంది. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు మనం అంతా ఆవకాయలో వాడే ఉప్పు, కారం, ఆవపిండి , నూనె కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అవి సహజసిద్ధమైన నిల్వ కారకాలుగా పనిచేస్తాయి.

రూమ్ టెంపరేచర్ వద్ద ఊరగాయ ఉంచినప్పుడే అందులో ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ జరిగి .. మన బాడీకి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ తయారవుతాయి. రోజులు గడిచే కొద్దీ ముక్క ఊరి ఆవకాయకు ఆ ఘాటైన రంగు, అద్భుతమైన టేస్ట్ రావడానికి ఈ సహజమైన వాతావరణమే కారణం అవుతాయట.

చాలామంది పచ్చడి రంగు మారుతుందనో లేదా బూజు పడుతుందనో భయపడి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ముక్క నూనెను ,మసాలాలను సరిగ్గా పీల్చుకోదు. ముఖ్యంగా మసాలాలన్నీ మామిడికాయ ముక్కకు పట్టకుండా విడివిడిగా ఉండి, తినేటప్పుడు ఆ అసలైన రుచి అనిపించదు.

అంతే కాకుండా ఫ్రిజ్‌లోని తేమ వల్ల బయటకు తీసినప్పుడు పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. బయట ఉంచిన ఊరగాయలో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు ఫ్రిజ్‌లో ఉంచిన దానికంటే చాలా మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Avakaya

ఆవకాయ ఏడాది పొడవునా తాజాగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. పచ్చడి తీసేటప్పుడు వాడే చెంచా కచ్చితంగా తడి లేకుండా పొడిగానే ఉండేలా చూడాలి. ఒక్క చుక్క నీరు తగిలినా పచ్చడి మొత్తం పాడవుతుంది. జాడీలో పచ్చడి పైన కనీసం ఒక అంగుళం వరకూ నూనె తేలుతూ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇది గాలి చొరబడకుండా కాపాడుతుంది.

అంతేకాకుండా పెద్ద జాడీని పదే పదే తెరవడం చేయకుండా.. నెలకు సరిపడా పచ్చడిని ఒక చిన్న గాజు సీసాలోకి తీసుకుని వాడుకోవడం వల్ల ఆవకాయ రుచి, రంగు ఎక్కువ కాలం చెడిపోకుండా, ముక్క మెత్త బడకుండా ఉంటుంది. పాతకాలపు పద్ధతులనే ఇప్పటికే పాటిస్తూ ఆవకాయను జాడీల్లోనే నిల్వ చేయడం వల్ల ఆ పరంపరను, రుచిని మనం కాపాడుకోవచ్చు.

RTC Strike : తెలంగాణలో ఆగని ఆర్టీసీ సమ్మె.. సందిట్లో సడేమియాలుగా మగ ప్రయాణికులు

Exit mobile version