Emotional Ignorance : చెప్పినా అర్థం కాదా..లేక కావాలనే నటిస్తారా ? రిలేషన్‌షిప్‌‌లో ఈ ప్రవర్తన వెనుక ఉన్న 4 నిజాలు..

Emotional Ignorance : పార్ట్‌నర్ చెప్పే సమస్యను అర్థం చేసుకుంటే.. ఆ తర్వాత వారి కోసం తమ బిహేవియర్‌ను మార్చుకోవాలి లేదంటే శ్రమ పడాలి.

Emotional Ignorance

అడిగినవారికి, అడగనివారికి ఫ్రీగా సలహాలు ఇస్తూ, ఆఫీసులోనూ ఫ్రెండ్స్ సర్కిల్‌లోనూ ప్రతీ ప్రాబ్లెమ్‌కు చిటికెలో సొల్యూషన్స్ వెతికేవారు కాస్తా..ఇంటికి వచ్చి పార్ట్‌నర్ ఏం చెప్పినా అర్థం కానట్లే నడుచుకుంటారు. మిగిలిన విషయాల్లో అంత మెచ్యూర్డ్‌గా ఉండే పర్సన్.. తన విషయంలోకి వచ్చేసరికి ఎందుకంత మొద్దుగా మారిపోతారు? నిజంగానే తన మనసు అర్థం కావడం లేదా లేక కావాలని నటిస్తున్నారా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అయితే సైకాలజీ ప్రకారం ఇది కేవలం ఒక బిహేవియర్ కాదు.. దీని వెనుక మెంటల్ యాటిట్యూడ్, ఎమోషనల్ ఇగ్నోరెన్స్(Emotional Ignorance) అండ్ కొన్ని సైకాలజికల్ రియాక్షన్లు కూడా దాగి ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు.

ఈ రియాక్షన్స్‌లో మొదటిది ఎమోషనల్ మైండ్ బ్లైండ్‌నెస్ (Alexithymia) అండ్ ఈజీ జోన్ (Comfort Zone). బయట ప్రపంచంలో ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్‌కు లాజిక్స్, ఫ్యాక్ట్స్ సరిపోతాయి. కానీ రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్ చెప్పేది లాజిక్ కాదు.. ఒక ఎమోషనల్ ఫీలింగ్. . చాలామందికి ఆఫీస్ డీల్స్ ఈజీగా క్లోజ్ చేయడం వస్తుంది. కానీ, ఎదుటివారి భావోద్వేగాన్ని డీకోడ్ చేసే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (EQ) తక్కువగా ఉంటుంది. పైగా పార్ట్‌నర్ మన సొంత ఆస్తి, ఎక్కడికీ పోరనే ఒక రకమైన టేకెన్ ఫర్ గ్రాంటెడ్ (Taken for granted) ఫీలింగ్ వల్ల, పార్ట్‌నర్ చెప్పే సీరియస్ ప్రాబ్లెమ్‌ను కూడా చాలా తేలికగా తీసుకుంటారు.

రెండోది కన్ఫర్మేషన్ బయాస్ (Confirmation Bias) & డిఫెన్స్ మెకానిజం. ఒక వ్యక్తి తనను తాను అన్ని విషయాలలో చాలా పర్ఫెక్ట్ అని నమ్ముతున్నప్పుడు.. పార్ట్‌నర్ వచ్చి మీ వల్ల నాకు ఈ సమస్య వస్తోందని చెబితే.. వాళ్ల సబ్‌కాన్షియస్ మైండ్ తన పర్ఫెక్ట్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అంటే తప్పు తనదేనని ఒప్పుకుంటే తన ఈగో దెబ్బతింటుంది కాబట్టి, ఆ సమస్య అర్థం కానట్లుగా ప్రవర్తించి దానిని ఒక సైకాలజికల్ షీల్డ్‌లా వాడుకుంటారు.

మూడోది కావాలనే నటించే స్టోన్‌వాలింగ్ (Stonewalling)లో కొన్నిసార్లు వారు నిజంగా నటిస్తారు. పార్ట్‌నర్ చెప్పే సమస్యను అర్థం చేసుకుంటే.. ఆ తర్వాత వారి కోసం తమ బిహేవియర్‌ను మార్చుకోవాలి లేదంటే శ్రమ పడాలి. ఆ ఛేంజ్ (Change) లేదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టం లేనప్పుడు, మనుషులు ఆ సమస్యను పక్కదారి పట్టించడానికి( Distort) అలాంటిదేమీ లేదు.. నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావ్ అని విషయాన్ని లైట్ తీసుకుంటారు. దీనిని ఎదుటివారిని పిచ్చివారిని చేసే గ్యాస్‌లైటింగ్ ట్రిక్ అంటారు.

Emotional Ignorance

నాలుగోది సొల్యూషన్ మైండ్ వర్సెస్ లిజనింగ్ మైండ్. బయటవారు ప్రాబ్లెమ్ చెప్పగానే సొల్యూషన్ వెతకడం అలవాటైన మనుషులు, పార్ట్‌నర్ తన బాధను చెప్పినపుడు కూడా దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తారు తప్ప, ఆ బాధలోని ఫీల్‌ని అర్థం చేసుకోరు. పార్ట్‌నర్ ఎమోషన్‌ని పంచుకుంటుంటే(Emotional Ignorance) వారు ప్రాక్టికల్ లాజిక్ వెతుకుతారు. ఈ ప్రాసెస్‌లో తాను ఎంత చెప్పినా వారికి అర్థం కావడం లేదనే ఫ్రస్ట్రేషన్ పార్ట్‌నర్‌లో పెరిగిపోతుంది.

దీనికోసం ఇద్దరూ కూర్చుని మాట్లాడే విధంగా ఒక టైమ్ సెట్ చేసుకోవాలి. ఎందుకు తన మనసులోని బాధను అర్థం చేసుకోవడం లేదో.. దాని వల్ల మెంటల్‌గా తాను ఎంత సఫర్ అవుతున్నాననేది పార్ట్‌నర్ వివరించాలి. నిజానికి సమస్య అర్థం కాకపోవడం కంటే, అర్థం చేసుకునే శ్రద్ధను కేటాయించకపోవడమే అసలైన గ్యాప్ అనేది వారికి తెలియజేయాలి. ముఖ్యంగా పాజ్ అండ్ బౌండరీ రూల్ పాటిస్తూ.. ఈ విషయాన్ని క్లియర్ చేసుకునేవరకు ఇద్దరం వేరే టాపిక్ మాట్లాడుకోవద్దని చాలా క్లియర్‌గా చెప్పాలి. అప్పటికీ అవతలివారు మారకపోతే పార్ట్‌నర్‌ మనసుకు ఏమనిపిస్తే అది చేయడమే సొల్యూషన్.

Zero Calories Foods : జీరో క్యాలరీస్ – ఫుల్ ప్రోటీన్.. ఈ 7 సూపర్ ఫుడ్స్ తింటే చాలు..

↑
Exit mobile version