Zero Calories Foods : జీరో క్యాలరీస్ – ఫుల్ ప్రోటీన్.. ఈ 7 సూపర్ ఫుడ్స్ తింటే చాలు..
Zero Calories Foods : వేగంగా, హెల్దీ వేలో వెయిట్ తగ్గడానికి మీ డైలీ ఫుడ్‌లో ఆహారంలో చేర్చుకోవాల్సిన 7 అద్భుతమైన ఫుడ్స్ గురించి నిపుణులు వివరిస్తున్నారు.
Zero Calories Foods
వెయిట్ తగ్గడం కోసం గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చినా కూడా చాలామందికి అనుకున్న రిజల్ట్ రాదు. అయితే అటువంటప్పుడు ఎక్సర్‌సైజుల కంటే కూడా తీసుకునే ఆహారంపైనే ఫోకస్ చేయాలి. వెయిట్ లాస్ అవ్వడం అంటే ఉపవాసాలు చేయడం అస్సలు కాదు.
తక్కువ క్యాలరీలు(Zero Calories Food), ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎంచుకోవడమే బెస్ట్ అని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలా తింటే కడుపు నిండిన ఫీలింగ్‌తో పాటు అనవసరమైన కొవ్వు కూడా ఫాస్ట్‌గా కరిగిపోతుంది. వేగంగా, హెల్దీ వేలో వెయిట్ తగ్గడానికి మీ డైలీ ఫుడ్‌లో ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆ 7 అద్భుతమైన ఫుడ్స్ గురించి నిపుణులు వివరిస్తున్నారు.
మొదటిది ఓట్స్.. దీనిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ((Zero Calories Food)గా ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉండి, అతిగా తినే అలవాటును కంట్రోల్ చేసేస్తుంది.

రెండోది గుడ్లు.. నాణ్యమైన ప్రోటీన్ ఉండే ఎగ్స్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది. ముఖ్యంగా మజిల్స్ స్ట్రాంగ్‌గా మారి కొవ్వు కరుగుతుంది.

మూడోది పనీర్.. శాకాహారులకు వెయిట్ తగ్గే ప్రయాణంలో పనీర్ చాలా మంచి ఆప్షన్. తక్కువ క్యాలరీలతో మెటబాలిజంను వేగవంతం చేయడంలో పనీర్ బెస్ట్.

నాలుగోది పచ్చని ఆకుకూరలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ కొండంత ఉంటే.. క్యాలరీలు మాత్రం జీరోకి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

ఐదోది బెర్రీలు.. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీల్లో నేచురల్ స్వీట్‌నెస్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్వీట్లు తినాలని క్రేవింగ్స్ వచ్చినపుడు బెర్రీలు బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ వీటిని డైలీ మెనూలో యాడ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.

ఆరోది పుచ్చకాయ.. దీనిలో 90 శాతం కంటే ఎక్కువ వాటర్ శాతమే ఉంటుంది. కాబట్టి క్యాలరీలు పెరగకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పుచ్చకాయ బెస్ట్ ఫుడ్.

ఏడోది గ్రీక్ పెరుగు.. నార్మల్ కర్డ్‌తో పోలిస్తే దీనిలో ప్రోటీన్ డబుల్ ఉంటుంది. పైగా క్యాలరీలు తక్కువ. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ వెయిట్ తగ్గే ప్రాసెస్‌ను స్పీడప్ చేస్తుంది. ఈ 7 ఆహారాలను మీ డైలీ మెనూ ప్లాన్‌లో చేర్చుకుని, రోజూ సరిపడినంత నీళ్లు తాగితే హెల్దీగా స్లిమ్ అవ్వడం గ్యారంటీ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.






