Emotional Unpredictability : ఒకసారి క్లోజ్.. మరోసారి డిస్టెన్స్.. అర్థం కాని ఆ ప్రవర్తన వెనుక ఏముంది?

Emotional Unpredictability : తాము సైలెంట్‌గా ఉండిపోవడం, అలాగే ఎదుటివారికి సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా తమ నిరసనను తెలియజేస్తుంటారు. తామెందుకు మూడ్ ఆఫ్ అయ్యామో ఎదుటివాళ్లే తెలుసుకోవాలని కోరుకుంటారు.

Emotional Unpredictability

మన చుట్టూ ఉన్నవాళ్లలో కొంతమందిని చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనతో ఒకరోజు ఎంతో ప్రేమగా, క్లోజ్‌గా మాట్లాడుతారు. కానీ మరుసటి రోజు చూస్తే ముఖం చిన్నది చేసుకుని, తమ మధ్య ఏదో జరిగినట్లు దూరం దూరంగా ఉంటారు.

అసలు వాళ్లు మన ప్రవర్తన వల్ల అలా మారారా లేదంటే వాళ్ల మనసులో వేరే ఏదైనా ఆలోచన ఉందా అని అర్థం కాక మనం తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రవర్తనను ఎమోషనల్ అన్‌ప్రెడిక్టబిలిటీ (Emotional Unpredictability) లేదా మూడ్ స్వింగ్స్ (Mood Swings) అని పిలుస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లు ఎక్కువగా యాంక్సియస్-ఎవాయిడెంట్ అటాచ్‌మెంట్ స్టైల్ (Anxious-Avoidant Attachment) కలిగి ఉంటారని మానసిక నిపుణులు చెబుతారు. అంటే వీరికి ఒకరితో బాగా క్లోజ్‌గా మూవ్ అవ్వాలని ఆశగా ఉంటుంది.

కానీ అంతలోనే ఎక్కడ తాము ఆ బంధంలో హర్ట్ అవుతామో లేదంటే తమ బలహీనతలు వారి ముందు బయటపడతాయోననే భయం పట్టుకుంటుంది. దాంతో వెంటనే డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోతూ.. ఎదుటి వ్యక్తికి దూరంగా జరిగిపోతారు. తమ ఎమోషన్లను తాము కంట్రోల్ చేసుకోవడానికి వారు వాడే ఆయుధమే ఈ సైలెన్స్ అని సైకాలజిస్టులు చెబుతారు.

మరికొందరిలో ఇది పాసివ్-అగ్రెసివ్ (Passive-Aggressive) బిహేవియర్ వల్ల కూడా ఇలా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా విషయం నచ్చనప్పుడు లేదంటే మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు దాన్ని సూటిగా వ్యక్తపరచడం వీళ్లకి చేతకాదు. దానికి బదులు తాము సైలెంట్‌గా ఉండిపోవడం, అలాగే ఎదుటివారికి సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా తమ నిరసనను తెలియజేస్తుంటారు. తామెందుకు మూడ్ ఆఫ్ అయ్యామో ఎదుటివాళ్లే తెలుసుకోవాలని వీరు కోరుకుంటారు.

అంతేకాకుండా మెంటల్ టెన్షన్స్, నిద్రలేమి, లేదా వ్యక్తిగత ఆందోళనలు (Anxiety) ఉన్నప్పుడు కూడా మనుషులలో ఈ ఎమోషనల్ అప్‌ అండ్ డౌన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సొంత ఆలోచనలని తాము ప్రాసెస్ చేసుకోలేక, ఆ మూడ్ వేరియేషన్‌ను తమకు తెలీకుండానే చుట్టూ ఉన్నవాళ్లపై చూపిస్తుంటారు.

ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు మీ చుట్టూ కూడా ఉంటే వారి మూడ్ ఆఫ్ అవ్వడానికి నేనే కారణమేమో అని ప్రతిసారీ ఎక్కువగా ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. వారి వెంట పడి అనవసరంగా ప్రశ్నలు అడగకుండా, కొంత టైమ్ వారిని ఒంటరిగా వదిలేయడమే మంచిది.

Emotional Unpredictability

వారు నార్మల్ మూడ్‌లోకి వచ్చాక, ప్రశాంతంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన వల్ల మీరు ఎలా ఫీలవుతున్నారో ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఒకవేళ అప్పటికీ మారకపోతే వాళ్లకు మూడ్ బాగున్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండటం, లేనప్పుడు ఇగ్నోర్ చేయడం అనే గేమ్‌లో మిమ్మల్ని వాడుకోకుండా చూసుకోవాలి.

మళ్లీ వాళ్లే నార్మల్ అయి మీ దగ్గరకు వస్తే వెంటనే మీరు ఏమీ జరగనట్లు రిసీవ్ చేసుకోకుండా కాస్త బౌండరీస్ మెయింటెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల వారి ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినట్లు అర్ధం చేసుకుంటారు. దీంతో వారిలో వారికే పశ్చాత్తాపం మొదలై చేంజ్ అవడానికి ప్రయత్నిస్తారు.

Rajinikanth Biopic : ఇక బుక్ రూపంలో తలైవా లైఫ్ జర్నీ..బయోపిక్‌పై సౌందర్య ప్లాన్..

Exit mobile version