Hair oil
చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, అమ్మలు తలకు నూనె పోసి మసాజ్ చేసేవాళ్లు. పొడిబారిన జుట్టును మృదువుగా, సిల్కీగా మార్చడానికి, హెడ్ బాత్ చేసేటప్పుడు వెంట్రుకల మధ్య వచ్చే రాపిడిని తగ్గించడానికి, డ్రైనెస్ నుంచి జుట్టును కాపాడటానికి ఆయిలింగ్ చాలా అవసరమే. కానీ హెయిర్ కోసం ఏ ఆయిల్ వాడుతున్నారు అనే దానికంటే, దాన్ని తలకు ఎలా అప్లై చేస్తున్నారనే చిన్న టెక్నిక్ మాత్రమే మీ హెయిర్ ఫాల్‌ను డిసైడ్ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం రోజూ జుట్టుకు నూనె రాసేటప్పుడు తెలీక చేసే కొన్ని బ్లండర్ మిస్టేక్స్ మీ జుట్టును నిశ్శబ్దంగా నాశనం చేస్తున్నాయని అంటున్నారు.
చిక్కులు తీయకుండా డైరెక్ట్‌గా ఆయిల్ రాయడమనేది మొదటి పొరపాటు. చిక్కులు ఉన్న జుట్టుకు ఆయిల్ రాస్తే ఆ రాపిడికి జుట్టు విపరీతంగా ఊడిపోవడం లేదా మధ్యలో తెగిపోవడం జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా జుట్టు చివరల నుంచి మెల్లగా దువ్వుకుంటూ పైవరకు మెల్లగా చిక్కులు పూర్తిగా తీసిన తర్వాతే నూనె(Hair oil) రాయడం స్టార్ట్ చేయాలి.
తలపై ఆయిల్‌తో విపరీతంగా రుద్దడం రెండో తప్పు. ఎక్కువసేపు ప్రెజర్ పెట్టి మసాజ్ చేస్తే ఆయిల్ మాడు లోపలికి పోతుందని అనుకుంటారు. కానీ మాడుపై విపరీతమైన ఒత్తిడి తెస్తే స్కిన్ కందిపోయి సెన్సిటివ్ అయిపోతుంది. దీని వల్ల హెయిర్ ఎక్కువగా ఊడుతుంది. నూనెను డైరెక్టుగా నెత్తిమీద కుమ్మరించకుండా వేలికొనలతో కానీ దూదితో కానీ కొద్దికొద్దిగా స్కాల్ప్‌పై అప్లై చేసి, సర్క్యులర్ మోషన్లో జెంటిల్‌గా మసాజ్ చేయడమే ప్రాపర్ వే అని నిపుణులు చెబుతున్నారు..
చాలా మంది ఎంత ఆయిల్ జుట్టుకు(Hair oil) రాస్తే అంత మంచిదని అనుకుని లీటర్ల కొద్దీ నూనెను నెత్తి మీద పోస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. నూనెతో హెయిర్ తడిసి ముద్దయితే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా అంత జిడ్డును వదిలించడానికి ఎక్కువ మోతాదులో షాంపూలు వాడాల్సి వస్తుంది. దీంతో కురుల్లో ఉండే నేచురల్ మాయిశ్చర్ పోయి స్కాల్ప్ మరింతగా డ్రై అయిపోతుంది. అందుకే జుట్టు పొడవును బట్టి తగినంత పరిమాణంలో మాత్రమే ఆయిల్‌ను రాయాలి.
రాత్రంతా నూనెను తలలోనే ఉంచేయడం నాలుగో మిస్టేక్. కానీ ఇది అందరికీ కరెక్ట్ కాదు..తలస్నానానికి అరగంట ముందు ఆయిల్ రాస్తే సరిపోతుంది . ఎందుకంటే చుండ్రు, జిడ్డు మాడు, దురద ఉన్నవారు రాత్రంతా ఆయిల్ రాసుకుని ఉంచితే ఆ ప్రాబ్లెమ్ డబుల్ అవుతుంది.
ఇక చివరిది..వేడి వేడి నూనెను జుట్టుకు రాయడం. వేడి నూనె మసాజ్ మంచిదే కానీ అది కేవలం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి . ఎందుకంటే ఎక్కువ వేడి ఉన్న ఆయిల్ రాయడం వల్ల స్కాల్ప్ మీది సెన్సిటివ్ స్కిన్ పూర్తిగా దెబ్బతింటుంది.
Heart Attack : గుండెపోటు లక్షణాలు మగవారిలో, మహిళలలో వేరువేరుగా ఉంటాయని తెలుసా? ఆ సమయంలో ఏం చేయాలి?
