Instant VS Filter Coffee : మీరు తాగే కాఫీ మీ ఏజ్‌ను పెంచుతుందా? ఇన్‌స్టంట్ వెర్సస్ ఫిల్టర్ కాఫీల గురించి నిజాలేంటి?

Instant VS Filter Coffee : కాఫీ గింజల్లో కాఫెస్టాల్ అనే ఒక టైప్ నేచురల్ ఆయిల్ ఉంటుంది. ఇది బ్లడ్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Instant VS Filter Coffee

మార్నింగ్ లేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగితే వచ్చే ఆ కిక్కే వేరు అంటారు కాఫీ లవర్స్. వర్క్ ప్రెజర్‌లో ఉన్నా, ఆఫీస్ వర్క్‌తో అలిసిపోయినా ఒక్క కప్పు కాఫీ పడితే మైండ్ సెట్ అయిపోతుంది. అయితే రోజూ ఇలా ఇష్టంగా తాగే ఈ కాఫీ, మన బాడీ ఎంత ఫాస్ట్‌గా ముసలిదైపోతోందో డిసైడ్ చేస్తుందనే విషయం మాత్రం చాలామందికి తెలీదు.

నిజానికి మనం కాఫీ తాగడం కంటే కూడా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుని తాగుతున్నామనేదే మన నిజమైన ఏజ్‌ను అంటే ..బయోలాజికల్ ఏజ్‌ను ఫిక్స్ చేస్తుందని బ్రిటన్‌కు చెందిన ఫేమస్ పరిశోధనా సంస్థ యూకే బయోబ్యాంక్ ఇటీవల చేసిన స్టడీలో బయటపడింది. దీంతో మనం తాగే ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీకి, మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ కాఫీకి(Instant VS Filter Coffee) మధ్య ఉన్న ఆ ఆసక్తికరమైన సైన్స్ గురించి చర్చ సాగుతుంది.

దీనికోసం ముందుగా బయోలాజికల్ ఏజ్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకోవాలి. ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకారం మారేది మన వయస్సు అయితే, మన బాడీలోని ఆర్గాన్స్ , సెల్స్ ఎంత హెల్దీగా, యంగ్‌గా పని చేస్తున్నాయో కొలవడాన్ని బయోలాజికల్ ఏజ్ అంటారు.

యూకే బయోబ్యాంక్ రీసెర్చర్లు దాదాపు 50 వేలమంది కాఫీ లవర్స్ బ్లడ్ శాంపిల్స్‌తో పాటు వారి లైఫ్‌స్టైల్‌ను పరిశీలించారు. ఈ రీసెర్చ్‌లో మనిషి డీఎన్‌ఏ చివరలో ఉండే టెలోమియర్లు అనేవి చాలా కీ రోల్ పోషిస్తున్నాయని తేలింది. ఈ టెలోమియర్ల పొడవును బట్టే మన సెల్స్ ఏజ్‌, మనం ముసలివాళ్లమయ్యే స్పీడ్ డిపెండ్ అయి ఉంటాయి.

ఈ స్టడీలో డైలీ ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారి బాడీలో బయోలాజికల్ ఏజ్ చాలా స్లోగా పెరుగుతున్నట్లు అలాగే వారి డీఎన్‌ఏలోని టెలోమియర్లు పొడవుగా ఉన్నట్లు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. కాఫీ గింజల్లో ఉండే నేచురల్ యాంటీఆక్సిడెంట్లు , బాడీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే పదార్థాలు హార్ట్‌ను సేఫ్‌గా ఉంచి డయాబెటిస్ వ్యాధి ముప్పును తగ్గిస్తాయి.

అయితే కాఫీ గింజల్లో కాఫెస్టాల్ అనే ఒక టైప్ నేచురల్ ఆయిల్ ఉంటుంది. ఇది బ్లడ్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అయితే మనం ఫిల్టర్ కాఫీ తయారు చేసేటప్పుడు వాడే ఫిల్టర్ పేపర్ ఈ హానికరమైన ఆయిల్ పదార్థాలను వడకట్టి.. కేవలం బాడీకి యూజ్ అయ్యే మంచి పోషకాలను మాత్రమే కాఫీలోకి వచ్చేలా చేస్తుంది.

కానీ ఇదే సమయంలో ఇన్‌స్టంట్ కాఫీ(Instant VS Filter Coffee) ఎక్కువగా తాగే వారిలో టెలోమియర్ల పొడవు స్లోగా తగ్గిపోవడం, ఏజ్ పెరిగే వేగం కొద్దిగా ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. ఎస్ప్రెస్సో వంటి ఇతర కాఫీ రకాల్లో మాత్రం పెద్దగా తేడాలు ఏమీ కనిపించలేదు.

Instant VS Filter Coffee

అయితే ఇన్‌స్టంట్ కాఫీ(Instant VS Filter Coffee) తాగినంత మాత్రాన జనాలంతా త్వరగా ముసలివాళ్లు అయిపోతారని కంగారు పడాల్సిన పని లేదని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ అధ్యయనంలో తేలిన తేడా కేవలం 0.1 నుంచి 0.2 సంవత్సరాలు మాత్రమే కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

సాధారణంగా ఫిల్టర్ కాఫీ తాగేవారికి మంచి డైట్‌తో పాటు వ్యాయామం, సరైన నిద్ర వంటి హెల్దీ హ్యాబిట్స్ ఉండటం కూడా దీనికి కారణం కావొచ్చని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు. కాబట్టి రోజుకు 2 – 3 కప్పుల ఫిల్టర్‌ కాఫీకి మించకుండా తాగుతూ.. మంచి తిండి,హెల్దీ లైఫ్‌స్టైల్ పాటిస్తే ఎప్పుడూ యంగ్‌గా ఉండొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

Coffee : కాఫీ లవర్స్ కు అలర్ట్..ఖాళీ కడుపుతో తాగితే సమస్యలే
↑
Exit mobile version