Lunch
లంచ్(Lunch) చేసేటప్పుడు చాలామంది ఆఫీస్ పనుల హడావుడిలోనో, టైమ్ లేదనో, ఫోన్ చూస్తూనో ఐదు, పది నిమిషాల్లోనే తినేస్తుంటారు. ఇలా ఫుడ్‌ను సరిగ్గా నమలకుండా, మింగేసే అలవాటును ఇంగ్లీషులో ఇన్‌హేలింగ్ ఫుడ్ అంటారు.
పైకి సమయాన్ని సేవ్ చేసే ఒక చిన్న అలవాటులా అనిపించినా.. ఇది జీర్ణవ్యవస్థను, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందని డాక్టర్లు అంటున్నారు. సాధారణంగా చాలామంది బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లతో పోలిస్తే లంచ్(Lunch) క్వాంటిటీ కాస్త ఎక్కువగానే తీసుకుంటారు.
అయితే ఇది పీక్ వర్క్ అవర్స్‌లో తినే భోజనం కాబట్టి.. చాలామంది ఈమెయిల్స్ చదువుతూనో, కాల్స్ మాట్లాడుతూనో స్పీడ్‌గా తినేస్తుంటారు. నిజానికి జీర్ణక్రియ అనేది పొట్టలో కాదు, మన నోట్లోనే మొదలవుతుందని డాక్టర్లు అంటున్నారు. మనం భోజనాన్ని బాగా నమిలినప్పుడు నోట్లోని లాలాజలం (సలైవా) దానితో కలవాలి.
లాలాజలంలో ఉండే ఎంజైములు ఫుడ్‌ను జీర్ణం చేయడానికి ముందే బ్రేక్ డౌన్ చేస్తాయి. కానీ మనం నమలకుండా ఫుడ్ మింగేయడం వల్ల పెద్ద పెద్ద ఆహార ముక్కలు డైరెక్టుగా పొట్టలోకి వెళ్తాయి. దీనివల్ల జీర్ణాశయం ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీంతో భోజనం చేసిన తర్వాత కడుపు భారీగా అనిపించడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అసిడిటీ, కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక రెండో ప్రమాదం ఏంటంటే.. ఇది మన మెదడును తప్పుదారి పట్టిస్తుంది. మనం తింటున్నప్పుడు కడుపు నిండిందనే సిగ్నల్ జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు చేరడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైమ్ పడుతుంది.
ఈ లోపు పొట్టలో కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు రిలీజయి ఇక చాలు అని బ్రెయిన్‌కి చెప్తాయి. కానీ మనం 5 లేదా 10 నిమిషాల్లోనే భోజనం ముగించేస్తే, కడుపు నిండిన విషయం మెదడుకు అసలు అందదు. దాంతో మనం అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం . ఇది బరువు పెరగడానికి, నడుము చుట్టుకొలత పెరగడానికి దారితీస్తుంది.
దీనికంటే పెద్ద డేంజర్ ఏంటంటే.. ఆహారాన్ని వేగంగా మింగేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇలా షుగర్ లెవెల్స్ ఆకస్మికంగా పెరగడం వల్ల వాటిని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఎక్కువ ఇన్సులిన్‌ను రిలీజ్ చేయాల్సి వస్తుంది.
రోజువారీగా ఈ ప్రాసెస్ ఇలాగే రిపీట్ అవ్వడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ రావడానికి మెయిన్ రీజన్ అవుతుంది. ముఖ్యంగా ఐబీఎస్ (ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్) వంటి కడుపు సమస్యలు ఉన్నవారికి ఈ అలవాటు వల్ల ఆ జబ్బులు మరింత ఎక్కువవుతాయి.
అందుకే మనం ఏం తింటున్నామనేదానితో పాటు ఎంత వేగంగా తింటున్నామనేది కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్లు. భోజనం చేసేటప్పుడు హెల్దీగా ఉండటం కోసం.. లంచ్(Lunch) చేయడానికి కనీసం 20 నిమిషాలు అయినా కేటాయించుకోవాలి.
భోజనాన్ని నోట్లో పెట్టుకున్నాక బాగా నమిలి మింగాలి. మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ నిదానంగా తినాలి. భోజనం చేసేటప్పుడు ఆఫీస్ పనులు చేయడం కానీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్లు చూడటం వంటివి కానీ అస్సలు చేయకూడదు.
వీలైతే భోజనంలో మొదట కూరగాయలు, సలాడ్స్ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. కడుపు నిండేంతవరకు కాకుండా, హాయిగా అనిపించగానే తినడం ఆపేయాలి. ఈ చిన్న ఛేంజెస్ చేసుకుంటే జీర్ణక్రియ బాగుండటమే కాకుండా ..ఎన్నో జబ్బుల నుంచి ముందే మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Mamata Banerjee : మేనల్లుడికి మమత బిగ్ షాక్..దీదీ దిద్దుబాటు చర్యలు
