Look Young: వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా? ఈ 5 ఎస్-మెడ్స్ ఫాలో అవ్వండి..

Look Young : టైం టు టైం హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి చేస్తే వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Look Young

ఈ రోజుల్లో ఎన్నేళ్లు బతికామా అనేది ముఖ్యం కాదు.. ఉన్నన్ని రోజులు ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నామనేదే అంతా చూస్తున్నారు. దీనికోసమే ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రాకుండా ఎప్పుడూ యంగ్‌(Look Young)గా ఉండడానికి ఆక్స్‌ఫర్డ్ లాంగెవిటీ ప్రాజెక్ట్ నివేదిక కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెబుతోంది.

దీనికోసం ఎస్ -మెడ్స్ ఫాలో అవ్వాలని నివేదిక వివరిస్తోంది. దీని ప్రకారం S అంటే Sleep (మంచి నిద్ర), M అంటే Mindset (పాజిటివ్ ఆలోచనలు), E అంటే Exercise (రోజూ వ్యాయామం), D అంటే Diet (మంచి ఆహారం) s అంటే Stress Reduction (టెన్షన్స్ తగ్గించుకోవడం) ఫాలో అవ్వాలని చెబుతోంది.

దీనిలో మొదటిది నాణ్యమైన నిద్ర. రోజూ రాత్రి పూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు హ్యాపీగా పడుకోవడం వల్ల గుండె, బ్రెయిన్ , నరాలు చాలా సురక్షితంగా ఉంటాయి. అయితే నిద్రపోయే కనీసం అరగంట ముందు మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం ఆపేస్తే క్వాలిటీ నిద్ర వస్తుందని నివేదిక వివరిస్తోంది.

రెండో ముఖ్యమైన అలవాటు మన మైండ్‌సెట్. జీవితం మీద ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండటం, నలుగురితో కలిసిమెలిసి తిరగడం , లైఫ్‌లో ఒక గోల్ ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వయసు పైబడుతున్న కొద్దీ ఒంటరితనం అనే ఫీలింగ్ పెరిగిపోకుండా ఉండాలంటే మైండ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.

మూడో అలవాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజులు. వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు బాడీకి పని చెప్పాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. దీనికోసం ప్రత్యేకించి జిమ్‌, ఏరోబిక్స్‌, యోగా వంటి వాటి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజూ కాసేపు నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం , ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, మొక్కలకు నీళ్లు పోస్తూ గార్డెనింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి.

నాలుగో అలవాటు మనం తినే ఫుడ్. వీలైనంత వరకు ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల పండ్లు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలు ఎక్కువగా ఉండే ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అల్ట్రా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కార్బ్స్‌, స్వీట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఐదో అలవాటు టెన్షన్స్ తగ్గించుకోవడం. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఒత్తిడి ఫీల్ అవ్వడం వల్ల గుండె జబ్బులు,ఊబకాయం, డిప్రెషన్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి. అందుకే మైండ్ ప్రశాంతంగా ఉండటానికి రోజూ కాసేపు మెడిటేషన్ చేయడం, లాంగ్ బ్రీత్ ఎక్సర్‌సైజులు చేయడం, కాసేపు ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకోవాలి.

Look Young

వీటితో పాటు స్మోకింగ్, మద్యపానం వంటి చెడ్డ అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. బాడీ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి టైం టు టైం హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి చేస్తే వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముసలితనం రాకుండా ఆపడం ఎవరితరం కాదు కానీ.. ఈ చిన్న చిన్న చిట్కాలు ఈ రోజు నుంచే ఫాలో అయితే మాత్రం వయసు పెరిగినా సరే ఎప్పుడూ హెల్తీగా, యంగ్‌(Look Young)గా జీవించొచ్చు.

Rishabh Pant : లక్నో కెప్టెన్సీకి పంత్ గుడ్ బై..ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడి

Exit mobile version