NOT Admitting WrongDoing : మీది తప్పు అని చెప్పగానే హర్ట్ అవుతున్నారా?..విమర్శను దాడిగా ఎందుకు ఫీలవుతున్నారు?

NOT Admitting WrongDoing : ఎవరైనా మన మిస్టేక్‌ను ఎత్తి చూపించినప్పుడు వెంటనే ఆవేశపడిపోకుండా, లేదా హర్ట్ అయిపోకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే.. దానిలో ఉన్న నిజం ఏంటో క్లియర్‌గా బోధపడుతుంది.

NOT Admitting WrongDoing

మనం మన డైలీ లైఫ్‌లో చాలామంది తెలివైనవారిని చూస్తుంటాం. మంచివారిని చూస్తుంటాం. అయితే వారు ఏ చిన్న విషయంలోనైనా సరే చిన్న పొరపాటు చేస్తే.. దానిని అవతలివారు సదుద్దేశంతో, ప్రేమతో చెప్పినా సరే కొంతమంది అసలు యాక్సెప్ట్ చేయలేరు.

మిస్టేక్‌ను తప్పయిందని ఒప్పుకోవడమో లేదంటే సరిదిద్దుకోవడమో చేయకుండా.. దానిని మనసుకు తీసుకుని బాధపడటం, లేదా నన్నే అంటావా అంటూ అవతలివారిపైనే తిరిగి నిందలు వేయడం వంటివి చేస్తుంటారు. నెగిటివ్ ఒపీనియన్‌ను, ఒక చిన్న సజెషన్‌ను కూడా తమపై జరిగిన ఒక దాడిలా భావించడమే దీనికి మెయిన్ రీజన్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

అసలు మనుషులు ఎందుకిలా రియాక్ట్ అవుతారనే విషయాన్ని సైకాలజీ ప్రకారం చూస్తే.. మనుషుల్లో ప్రతీ ఒక్కరికీ కూడా తమ గురించి తమకు ఒక గుడ్ విల్ ఉంటుంది. తాము చాలా మంచివాళ్లమని, తమ పనులు తాము సరిగ్గానే చేస్తున్నామనే ఫీలింగ్ మన మనసులో బలంగా నాటుకుపోతుంది. ఎవరైనా వచ్చి మన నమ్మకానికి డిఫరెంట్‌గా మాట్లాడినప్పుడు, మనసులో ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ (Insecurity) ఫీలింగ్ స్టార్టవుతుంది.

ఆ క్షణంలో వారు చెప్పే మాట మనకోసమే.. మన బిహేవియర్‌ను మార్చుకోవడానికే అనో లేదంటే మన తప్పును సరిదిద్దుకోవడానికే అనో ఆలోచించకుండా,తమ వ్యక్తిత్వాన్నే తక్కువ చేసి అవతలివారు మాట్లాడుతున్నారని మనసు పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. విమర్శ అనేది ఎప్పుడూ కూడా మనల్ని తక్కువ చేయడానికి ఇచ్చేది కాదు. మనలో ఉండే చిన్న చిన్న డిఫరెన్స్‌ను సరిదిద్దుకుని మరింత బెటర్‌గా మారడానికి దొరికే ఒక మంచి ఛాన్స్. ఎవరైనా మన మిస్టేక్‌ను ఎత్తి చూపించినప్పుడు వెంటనే ఆవేశపడిపోకుండా, లేదా హర్ట్ అయిపోకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే.. దానిలో ఉన్న నిజం ఏంటో క్లియర్‌గా బోధపడుతుంది. మన ప్రశాంతతకు, రిలేషన్స్ నిలబడటానికి ఈ చిన్న ఓర్పు, అర్దం చేసుకునే గుణం ఎంతో అవసరం.

NOT Admitting WrongDoing

మరి ఎదుటివారికి వాళ్ల తప్పును వారి మనసు గాయపడకుండా చెప్పడం ఎలా అనేది కూడా తెలుసుకోవాలి. ఎదుటివారి మిస్టేక్‌ను డైరెక్టుగా నిందించేలా కాకుండా, చాలా మృదువుగా చెప్పాలి. ఉదాహరణకు మీరు చేసిన ఈ పని వల్ల చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది, దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఏమో కదా అని సర్దిచెప్పినట్లు మాట్లాడాలి. మనం ఇచ్చే సజెషన్ వాళ్లపై అటాక్‌లా కాకుండా, వాళ్ల మంచి కోరి చెబుతున్నామనే నమ్మకం కలిగినప్పుడు ఎదుటివారు కచ్చితంగా దానిని పాజిటివ్‌గా స్వీకరిస్తారు.

Love And Attachment : ప్రేమ నిజంగా ప్రేమేనా..లేక కోల్పోతామనే భయమా? ఓషో చెప్పిన సత్యం..

Exit mobile version