Raw Banana
మనం సాధారణంగా అరటి పండ్లు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాం. అలాగే కూరల్లో, వేపుళ్లలో, వేడివేడి బజ్జీల్లో వాడే అరటికాయను కూడా ఇష్టపడతాము. అయితే ఈ అరటికాయ వెనుక పవర్‌ఫుల్ హెల్త్ సీక్రెట్ దాగి ఉందని చాలా మందికి తెలీదు.
న్యూట్రిషనిస్టులు చెబుతున్నదాని ప్రకారం .. అరటికాయ కేవలం ఒక వెజిటబుల్ మాత్రమే కాదు.. మన బాడీకి ఎన్నో రోగాల బారి నుంచి కాపాడే ఒక నేచురల్ మెడిసిన్ డోస్. మీ డైట్‌లో తరచూ దీన్ని చేర్చుకుంటే ఊహించని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఇది మన జీర్ణవ్యవస్థను బనానా రీఫ్రెష్ చేస్తుంది. అరటికాయలో మెండుగా ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, పీచు పదార్థాలు జీర్ణక్రియ వేగాన్ని పెంచుతాయి. ప్రేగుల కదలికలను బ్యాలెన్స్ చేసి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి.
ఇక డయాబెటిస్ బాధితులకు అరటికాయ ఒక గొప్ప వరం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉండటం వల్ల, దీనిని తిన్న వెంటనే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఏ మాత్రం పెరగవు. అందుకే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు ధైర్యంగా తమ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న ఓవర్ వెయిట్ సమస్యకు పచ్చి అరటికాయ(Raw Banana) అద్భుతంగా చెక్ పెడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి కాస్త సమయం పట్టడంతో కడుపు నిండినట్లు అనిపించి ఇతర ఫుడ్ తినాలనే ఆకలి కోరికలు చల్లారతాయి.
ఇక మరో ప్రయోజనం గుండె భద్రత. పచ్చి అరటికాయలో(Raw Banana) పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని అదుపులో ఉంచి, దాని వల్ల రక్తనాళాలపై పడే ప్రెజర్‌ను తగ్గించి హార్ట్ సంబంధిత జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.
చివరగా అరటికాయ(Raw Banana) మన కడుపులోని ప్రేగుల హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీబయోటిక్‌గా పనిచేసి, కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తుంది. దీంతో రెసిస్టెన్స్ పవర్ అమాంతం పెరుగుతుంది. అయితే అరటికాయను నూనెలో ఎక్కువగా వేయించి తినకపోవడమే బెటర్.
