Micromance
లవ్ ప్రపోజల్స్, డేటింగ్‌ల టైమ్‌లో ఉండే ఎగ్జైట్‌మెంట్ పెళ్లైన కొన్నేళ్లకి కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. దీనికోసం కాస్ట్లీ గిఫ్ట్‌లు, గ్రాండ్ సర్ప్రైజ్‌లతో ఈ గ్యాప్‌ను తగ్గించుకోవాలని చూస్తే సరిపోదంటున్నారు మానసిక నిపుణులు.
ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో రిలేషన్‌షిప్స్‌ని స్ట్రాంగ్‌గా నిలబెడుతోంది గిఫ్ట్‌లు కాదని, డైలీ లైఫ్‌లో చూపించే అతి చిన్న కేరింగ్ మాత్రమేనని చెబుతున్నారు. దీనినే ఇప్పుడు సైకాలజిస్టులు, లైఫ్‌స్టైల్ ఎక్స్‌పర్ట్స్ మైక్రోమాన్స్(Micromance) అని పిలుస్తున్నారు. అవును, ఇదే ఇప్పుడు జనరేషన్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్న సరికొత్త ట్రెండ్.
నిజానికి మైక్రోమాన్స్ అంటే కొత్త ట్రెండ్ ఏం కాదు. పార్ట్‌నర్ అలసిపోయి ఆఫీస్ నుంచి రాగానే ఏమీ అడగకుండా ఒక కప్పు వేడి వేడి కాఫీ చేతికి అందించడం, ఆఫీస్ బ్యాగ్‌లో లేదా లంచ్ బాక్స్‌లో ..టైమ్‌కు తిను, లవ్ యూ అని ఒక చిన్న నోట్ రాసి పెట్టడం, ఎంత బిజీగా ఉన్నా తిన్నావా అని ఒక చిన్న మెసేజ్ పంపడం… ఇవన్నీ కూడా మైక్రోమాన్స్ కిందికే వస్తాయి. కేవలం మీ పార్ట్‌నర్ పట్ల మీకున్న శ్రద్ధను, ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించడమే ఈ ట్రెండ్ అన్నమాట .
మైక్రోమాన్స్ వల్ల రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ప్రెజర్ కూడా ఉండదు. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలే ఉండదు. కేవలం మనసుంటే చాలు. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత కానీ లాంగ్ రిలేషన్‌షిప్‌లో కానీ రొటీన్ లైఫ్ వల్ల కాస్త బోర్ కొట్టడం కామనే.
అటువంటప్పుడు తమ భాగస్వామి ఎప్పుడో చెప్పిన చిన్న విషయాన్ని, అంటే వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్ ఆర్డర్ పెట్టడమో, నచ్చిన ప్లేసుకు తీసుకుని వెళ్లడమో, లేక వారి చిన్ననాటి జ్ఞాపకాన్నో గుర్తు చేసేలా చిన్న గిఫ్ట్ ఇస్తే చాలు. వీటిలో దేనికి కూడా పెద్ద ఖర్చే ఉండదు. కానీ ఆ చిన్న సంతోషం ఇచ్చే బూస్టింగ్, వారిలో అలసటను, లోన్లీనెస్‌ను ఒక్క క్షణంలో మాయం చేస్తుంది.
ఇప్పుడు అందరి లైఫ్ ఎంతో కొంత టెన్షన్‌తో, యాంగ్జైటీతో సాగుతోంది. ఇలాంటి రన్నింగ్ లైఫ్‌లో పార్ట్‌నర్ నుంచి లభించే ఒక చిన్న హగ్ లేదా నేనున్నాననే ఒక చిన్న భరోసా ఎదుటివారికి మెంటల్ పీస్‌ను ఇస్తుంది.
పెద్ద పెద్ద ప్లాన్స్ కోసం, అకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయి. ఈలోగా రిలేషన్‌షిప్‌లో వారిద్దరి మధ్య ఉండాల్సిన ఫీల్ మిస్ అవుతుంది. అందుకే వీలయినంతగా వీలు చేసుకుని మరీ పార్ట్‌నర్‌కు స్పెషల్‌గా అనిపించేలా చేయడమే ఈ మైక్రోమాన్స్(Micromance) యొక్క బ్యూటీ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
నిజానికి లైఫ్‌లో సంతోషాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ రోజూ ప్రశాంతంగా, హ్యాపీగా సాగిపోయే లైఫ్‌లో చిన్న చిన్న మ్యాజిక్‌లు మాత్రం జీవితాన్ని రోజూ అందంగా మారుస్తాయి. గ్రాండ్ ప్లాన్స్ కోసం వెయిట్ చేయడం ఆపేసి, ఈ రోజు నుంచే మీ రిలేషన్‌షిప్‌లో ఈ క్యూట్ మైక్రోమాన్స్‌ని యాడ్ చేసుకుని.. ఆ మ్యాజిక్‌ని మీరూ ఎక్స్‌పీరియన్స్ చేయండి.
Ilaiyaraaja : ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. ఆ 134 మూవీ సాంగ్స్‌పై వివాదం ఏంటి ?
