Ilaiyaraaja : ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. ఆ 134 మూవీ సాంగ్స్‌పై వివాదం ఏంటి ?
Ilaiyaraaja : దక్షిణాది మూవీ మ్యూజిక్ వరల్డ్‌ను దశాబ్దాల పాటు తన స్వరాలతో ఏలిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Ilaiyaraaja
ఇళయరాజా మ్యూజిక్ అందించిన అన్నక్కిలి, 16 వయతినిలే వంటి సుమారు 134 సూపర్ హిట్ మూవీల సాంగ్స్ రైట్స్‌కు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కేన్సిల్ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీనివల్ల ప్రస్తుతానికి ఆ సాంగ్స్‌పై ఇళయరాజాకు ఎలాంటి హక్కులు ఉండవు.
ఈ వివాదానికి 1976 నుంచి 2001 మధ్య కాలంలో రిలీజైన 134 మూవీల ఆడియో హక్కులు ప్రధాన కారణం. ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్ తాము ఆ మూవీల ప్రొడ్యూసర్లతో అఫీషియల్‌గా ఒప్పందాలు కుదుర్చుకున్నామని కోర్టును ఆశ్రయించింది. ఆ మూవీల సంగీతం, సౌండ్ రికార్డింగ్‌లపై ప్రపంచవ్యాప్తంగా తమకే పర్మినెంట్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని సరిగమ వాదిస్తోంది.

అయితే, ఇళయరాజా(Ilaiyaraaja) ఈ సాంగ్స్‌ను వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనవిగా చెబుతూ అప్‌లోడ్ చేయడం చట్టవిరుద్ధమని ఆ కంపెనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 1957 నాటి భారతీయ కాపీరైట్ చట్టం ప్రకారం, ఒక మూవీ కోసం క్రియేట్ చేసిన మ్యూజిక్‌కు లేదా సాహిత్యానికి ఆ మూవీ ప్రొడ్యూసర్‌కే ఫస్ట్ రైట్ ఉంటుంది.
ప్రొడ్యూసర్స్ నుంచి ఆ రైట్స్ తాము కొన్నాం కాబట్టి, వాటిపై ఇళయరాజాకు పవర్ లేదన్నది సరిగమ కంపెనీ న్యాయవాదుల వాదన. దీనిని పరిశీలించిన కోర్టు, గతంలోనే ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఇళయరాజా కోరగా, కోర్టు దానికి నిరాకరిస్తూ పైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు పాత ఆదేశాలే అమల్లో ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతానికి అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ డెసిషన్‌తో సరిగమ కంపెనీ పైచేయి సాధించగా, ఈ సుదీర్ఘ కాపీరైట్ పోరాటంలో ఫైనల్ తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Cockroach Janta Party : కాక్రోచ్ ఉద్యమం చల్లబడిందా ?.. దీక్షకు కనిపించని మద్దతు





