Clay Pot :మట్టికుండ నీరు అమృతమే.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

Clay Pot : మట్టికుండను వాడే విషయంలో కొన్ని మెయిన్ రూల్స్ తెలీకపోతే ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

Clay Pot

సమ్మర్‌లో చల్లని నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడతారు. కూల్ వాటర్ కోసం ఫ్రిజ్ నీళ్లు తాగితే .. నీటి వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే మట్టికుండ నీరు మంచిది. మట్టికుండ(Clay Pot ) నీరు కేవలం కూలింగ్‌ను ఇవ్వడమే కాకుండా, శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందించి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.

అయితే, మట్టికుండను వాడే విషయంలో కొన్ని మెయిన్ రూల్స్ తెలీకపోతే ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా కొత్త కుండను కొన్న వెంటనే డైరెక్టుగా వాడకూడదు. దానిని కనీసం 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కుండలోని మట్టి వాసన పోవడమే కాకుండా, నీరు చల్లగా ఉండటానికి అవసరమైన రంధ్రాలు తెరుచుకుంటాయి.

కుండను శుభ్రం చేసే పద్ధతిలో కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు. మట్టికుండ (Clay Pot) ను కడిగేటప్పుడు సోప్ గాని, డిటర్జెంట్ గాని అస్సలు వాడకూడదు. ఎందుకంటే మట్టిలో ఉండే సన్నని రంధ్రాలు ఆ కెమికల్స్‌ను పీల్చుకుంటాయి. అది నీటిలో కలిసి మన కడుపులోకి వెళ్తుంది.

కేవలం ఉప్పు లేదా బేకింగ్ సోడాను ఉపయోగించి మెత్తని స్క్రబ్బర్‌తో మంచినీళ్ల కుండను క్లీన్ చేయాలి. నెలకు ఒకసారి వెనిగర్ కలిపిన నీటితో శుభ్రం చేస్తే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. అలాగే కుండను శుభ్రం చేసిన తర్వాత ఒక రోజంతా ఎండలో ఉంచడం వల్ల దానిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి.

Clay Pot

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కుండలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిలో హానికరమైన బ్యాక్టీరియాతో పాటు దోమల లార్వాలు పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ నీటిని మార్చడం, కుండను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, చల్లని నీటిని మనం ఆస్వాదించొచ్చు. లేకపోతే అదే నీరు టైఫాయిడ్ , కలరా వంటి వ్యాధులకు కారణం అవుతుంది. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ సిద్ధమైన ఫ్రిజ్‌ను సరైన పద్ధతిలో వాడుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

WhatsApp:వాట్సాప్ నుంచి ప్రీమియం సర్వీస్.. ఇకపై ఆ ఫీచర్లు కావాలంటే డబ్బులు చెల్లించాలట..

Exit mobile version