WhatsApp:వాట్సాప్ నుంచి ప్రీమియం సర్వీస్.. ఇకపై ఆ ఫీచర్లు కావాలంటే డబ్బులు చెల్లించాలట..
WhatsApp: ప్రతి చాట్‌కు వేర్వేరు థీమ్‌లు, స్పెషల్ రింగ్‌టోన్‌లు, నోటిఫికేషన్ సౌండ్‌లను సెట్ చేసుకున అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫోన్ చూడకుండానే ఏ గ్రూప్ నుంచి , ఎవరి నుంచి మెసేజ్ వచ్చిందో ఈజీగా కనిపెట్టవచ్చు.
వాట్సాప్ తన యూజర్స్ కోసం ఒక సరికొత్త విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు ఫ్రీగా సేవలందిస్తున్న ఈ ప్లాట్‌ఫారమ్, త్వరలో వాట్సాప్ ప్లస్ పేరుతో ఒక ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లు తమ యూజర్ల కోసం ప్లస్ వర్షన్లను నడుపుతున్నట్లే, మెటా కంపెనీ కూడా వాట్సాప్‌లో ఈ సర్వీసులను ప్రవేశపెట్టనుంది.
ఈ కొత్త ప్రీమియం ప్లాన్ ముఖ్యంగా యాప్ వాడకంలో వైవిధ్యం , వ్యక్తిగతీకరణ (Personalization) కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది కేవలం బిజినెస్ కమ్యూనిటీలకే కాకుండా, సాధారణ వినియోగదారులకు కూడా యాప్‌పై పూర్తి కంట్రోల్‌ను ఇస్తుంది.
వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి యాప్ రూపురేఖలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో అందరికీ ఒకే రకమైన ఐకాన్, లిమిటెడ్ థీమ్‌లు ఉంటాయి. కానీ ప్రీమియం యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమ్ యాప్ ఐకాన్‌లను సెట్ చేసుకోవచ్చు.
అంతేకాదు, ప్రతి చాట్‌కు వేర్వేరు థీమ్‌లు, స్పెషల్ రింగ్‌టోన్‌లు, నోటిఫికేషన్ సౌండ్‌లను సెట్ చేసుకున అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫోన్ చూడకుండానే ఏ గ్రూప్ నుంచి , ఎవరి నుంచి మెసేజ్ వచ్చిందో ఈజీగా కనిపెట్టవచ్చు. యాప్ విజువల్ ఎక్స్పీరియన్స్‌ను పూర్తిగా మార్చేయాలనుకునే వారికి ఇదొక గొప్ప ఫీచర్ అని చెప్పాలి.
ఈ ప్రీమియం ప్లాన్‌లో యూజర్లును చాట్ పిన్ లిమిట్ పెంపు మరింత అట్రాక్ట్ చేయనుంది. సాధారణంగా వాట్సాప్(WhatsApp)లో మనం కేవలం మూడు ముఖ్యమైన చాట్‌లను మాత్రమే టాప్‌లో ఉండేలా పిన్ చేసుకోగలుగుతున్నాము. కానీ వాట్సాప్ ప్లస్ ద్వారా ఈ లిమిట్‌ని ఏకంగా 20 వరకు పెంచనున్నట్లు తెలుస్తుంది.
దీనివల్ల ఆఫీస్ గ్రూపులు, ఫ్యామిలీ చాట్స్, ఇంపార్టెంట్ కాంటాక్ట్‌లను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన మెసేజ్‌లు కిందకు వెళ్లిపోకుండా ఎప్పుడూ కళ్ల ముందే ఉండేలా చూసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాట్ లిస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇది ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు దీనిని ఫ్రీ ట్రయల్ కింద ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా యాప్‌లో యాడ్స్ రావు లేదా పోవు అనే గ్యారెంటీ లేదు, ఎందుకంటే ఇది కేవలం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడం కోసమే తీసుకొస్తున్నారు.
మెటా కంపెనీకి ఇది ఒక కొత్త ఇన్కమ్ సోర్స్‌గా మారనుండగా, భారతీయ మార్కెట్‌లో వాట్సాప్ (WhatsApp)ప్లస్ ఎంతటి క్రేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆకర్షణీయమైన ఫీచర్లు, పర్సనలైజేషన్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే వారికి ఈ వాట్సాప్ ప్లస్ ది బెస్ట్ కానుంది.
Gold price : భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?





