Theft At Relatives Homes : బంధువులు,స్నేహితుల ఇంట్లో చేతివాటం..ఈ అలవాటుపై సైకాలజీ చెప్పే నిజాలేంటి..

Theft At Relatives Homes : తెలిసిన వారింట్లో ఇలాంటి చేతివాటం ప్రదర్శించే వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Theft At Relatives Homes

బంధువులు, ఫ్రెండ్స్ ఒకరింట్లో జరిగే ఫంక్షన్‌కో లేదంటే పార్టీకో వచ్చినప్పుడు ..వారంతా వెళ్లిపోయాక కాస్మొటిక్స్, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిల్స్, సిల్వర్ ఐటెమ్స్, కొన్నిసార్లు క్యాష్ కూడా మాయం అవుతుంటాయి. దీన్ని కేవలం సాధారణ దొంగతనం అని కొట్టిపారేయలేమని సైకాలజిస్టులు అంటున్నారు. దీని వెనుక మనిషి హ్యూమన్ బ్రెయిన్, సోషియో సైకలాజికల్ ఫ్యాక్టర్స్‌కు సంబంధించిన చాలా ఆసక్తికరమైన కోణాలు దాగున్నాయని వివరిస్తున్నారు.

ఇలా తెలిసిన వారింట్లో ఇలాంటి చేతివాటం ప్రదర్శించే వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అబ్బాయిలు సాధారణంగా ఫ్రెండ్స్ , రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్లినప్పుడు వారి హాల్‌లో మాత్రమే కూర్చోవడం, బయటికి వెళ్లడం, మాట్లాడటంతోనే సరిపెడతారు.

కానీ అమ్మాయిలు మాత్రం ఆ ఇళ్లలోని బెడ్‌రూమ్‌లు, డ్రెస్సింగ్ టేబుల్స్, వార్డ్‌రోబ్స్ , మేకప్ కిట్లు ఉండే ప్రైవేట్ స్పేస్‌లోకి కూడా ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉంటారు. వీళ్లు మన వాళ్లే కదా అనే నమ్మకంతో ఆ ఇంట్లో(Theft At Relatives Homes) వాళ్లు కూడా వారిని ఎవరినీ అనుమానించకుండా వదిలేస్తారు. ఆ క్లోజ్ యాక్సెస్ వల్లే అమ్మాయిలు అక్కడ కనిపించే బ్రాండెడ్ ప్రొడక్ట్స్, క్యాష్‌ వంటివి కొట్టేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

బంధువులు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంట్లో(Theft At Relatives Homes) లాకర్స్ ఎక్కడ ఉంటాయి, డబ్బులు ఎక్కడ దాస్తారనే విషయాలు చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు. పైగా వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు..అలాగే చాలా మంది ఇంట్లో ఉన్నారు కాబట్టి తమను పర్టిక్యులర్‌గా అనుమానించరనే నమ్మకం వాళ్లకు అతిపెద్ద ధైర్యాన్ని ఇస్తుంది.

ఒకవేళ వారెవరికైనా అనుమానం వచ్చి అడిగినా కూడా.. నేను ఈ ఇంట్లో ఎన్నోసార్లు ఉన్నాను కదా, నేనెందుకు చేస్తాను.. ఇలాంటి నిందలు నాపై వేశారు కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటానంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే టెక్నిక్స్ ఈజీగా వాడతారు.

Theft At Relatives Homes

కొంతమందికి సోషల్ స్టేటస్ కోసం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నలుగురిలో తిరిగేటప్పుడు కాస్ట్‌లీ డ్రస్సులు వేసుకోవాలని, ఖరీదైన గ్యాడ్జెట్లు వాడాలని అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. దీనికోసం ఇలా తెలిసిన వారింట్లోనే చోరీ సేఫ్ అనుకుని కూల్‌గా చేతివాటం చూపిస్తారు. సొంతంగా డబ్బులు సంపాదించలేని పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అడ్డదారులను ఎంచుకుంటారు.

మొత్తం మీద చూస్తే, ఇది పక్కాగా ప్లాన్ చేసి చేసే క్రిమినల్ నేరం కాదు. అయినా కూడా ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే టెంప్టేషన్, ప్రైవేట్ స్పేస్‌లోకి ఈజీగా వెళ్లే అవకాశం అమ్మాయిలకు ఎక్కువగా ఉండటం వల్ల..ఈ రకమైన ప్రవర్తన బయటపడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

Fire therapy: చైనాలో 100 ఏళ్లుగా వాడుతున్న ‘ఫైర్ థెరపీ’..అసలేంటిది?
↑
Exit mobile version