Premature Aging : టెన్షన్ పడితే ఫేస్ షేప్ మారిపోతోందా? చిన్న వయసులోనే ఏజింగ్ ఛాయలొస్తాయా?

Premature Aging : దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనలు ఫేస్ అందంపై చూపే ప్రభావం, మొటిమలు, ఐ బ్యాగ్స్, స్కిన్ పొడిబారడం వంటి సమస్యలు, వాటిని తగ్గించే మార్గాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Premature Aging

మనసులో ఒత్తిడి పెరిగినప్పుడల్లా దాని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా మన ఫేస్ మీదే పడుతుందట. ఆఫీస్ వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ టెన్షన్స్ , ఫ్యూచర్ గురించిన ఆందోళనలు ఎక్కువైతే, తెలీకుండానే మనం ఫుడ్ వైపు లాగబడతాం. టైమ్‌కు నిద్రపోకపోవడం, ఏది పడితే అది తినడం వల్ల స్కిన్ టోన్ మారిపోవడం, ఫేస్ డల్(Premature Aging) అయిపోవడం చాలా కామన్‌గా జరుగుతుంది.

దీర్ఘకాలిక ప్రెజర్ వల్ల బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ మోతాదు పెరుగుతుంది. ఇది స్కిన్‌లోని ఆయిల్ గ్లాండ్స్‌ను యాక్టివేట్ చేసి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. దీంతో పోర్స్ బ్లాక్ అయి మొటిమలు ,చిన్నచిన్న కురుపులు వస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ రిపోర్ట్ ప్రకారం స్ట్రెస్ వల్ల మొటిమలతో పాటు జుట్టు రాలడం, హెయిర్ థిన్నింగ్, ఎగ్జిమా, రాషెస్,సోరియాసిస్ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి.

కళ్ల కింద ఉబ్బరం లేదంటే ఐ బ్యాగ్స్ సమస్య సాధారణంగా ఏజ్ పెరిగే కొద్దీ వస్తుందని అనుకుంటాం. కానీ టెన్షన్ వల్ల నిద్రలేమి తలెత్తి, కళ్ల కింద వాపు, ఐలిడ్స్ ఉబ్బడం వంటివి త్వరగా కనిపిస్తాయి. అంతేకాదు, స్కిన్ సాగే గుణం తగ్గిపోవడం, పిగ్మెంటేషన్, తక్కువ ఏజ్‌లోనే ముసలితనం ఛాయలు రావడం వంటి ప్రాబ్లెమ్స్ కూడా ఇబ్బంది పెడతాయి. మరోవైపు స్కిన్ తేమగా ఉండటానికి తోడ్పడే ప్రొటీన్లు, లిపిడ్ల పనితీరు మానసిక ఒత్తిడి వల్ల దెబ్బతింటుంది. దీంతో స్కిన్ డ్రై అయిపోయి దురద పుడుతుంది. హార్వర్డ్ రీసెర్చ్‌ ప్రకారం ఒత్తిడి వల్ల స్కిన్‌ పైపొర అయిన ఎపిడెర్మల్ బారియర్ కూడా వీక్ అవుతుంది.

ఈ ప్రాబ్లెమ్స్(Premature Aging) నుంచి బయటపడాలంటే ముందు మనసును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒక ఇష్టమైన పనిలో బిజీ అవ్వడం మంచిది. అనవసరమైన ఆలోచనలతో మైండ్‌ను గజిబిజిగా ఉంచకుండా.. మీకు నచ్చిన హాబీ లేదా పని చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. డైట్ విషయంలోనూ చిన్న చేంజెస్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఎగ్స్, డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు తింటే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రెస్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, వర్కౌట్, యోగా లేదా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకుంటే కార్టిసాల్ హార్మోన్ కంట్రోల్‌లో ఉంటుంది. మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇన్ని చేసినా టెన్షన్ తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానసిక నిపుణులను కలవాలి. మొదట్లోనే జాగ్రత్త పడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పిన వివరాలన్నీ అవగాహన కోసమే .. ఏదైనా డైట్ లేదా ఆరోగ్య మార్పులు చేసుకునే ముందు మీ డాక్టర్ సలహా తీసుకుంటేనే మంచిది.

Sleep Mask : రోజూ స్లీప్ మాస్క్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే స్కిన్ దెబ్బతింటుందట..

↑
Exit mobile version