Reassurance
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా పార్ట్‌నర్ అలిగినప్పుడు తప్పు మన వైపే ఉందని తెలిసీ కూడా.. ఏం చేయాలో తెలీక తడబడటమనేది చాలా కామన్‌గా కనిపించే విషయం. ఎందుకంటే తప్పు పార్ట్‌నర్‌ది కాదని తనదేనని తెలిసినా బయటకు ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తుంది. ఈ విషయానికే అంత సీన్ చేయాలా..నా ఉద్దేశం అది కాదు కదా అని సమర్థించుకోవడానికి వంద లాజిక్కులు వెతుక్కుంటారు.
కానీ ఇక్కడే ఒక చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు. వారి చిన్న అలసత్వమో లేదంటే వారు అన్న ఒక్క మాటో ఇంకా లేదంటే వారు చేసిన చిన్న పొరపాటో ఆమె మనసును గాయపరిచిందన్న విషయం తెలిసీ కూడా తాను గెలవడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే వారు గెలవడానికి చేసే ప్రయత్నంలో వారి బంధం ఓడిపోతుందన్న విషయం మాత్రం తెలుసుకోలేరు. కానీ ఇక్కడ వారి వల్లే ఆమె అలిగినప్పుడు లేదా బాధపడినప్పుడు వారి వైపు నుంచి రావాల్సింది డిఫెన్స్ కాదని.. పక్కా రెస్పాన్సిబిలిటీ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
తప్పు ఎదుటి వారిదైనప్పుడు వారు చేయాల్సిన ఫస్ట్ అండ్ పవర్‌ఫుల్ పని వెంటనే ఆమెకు సారీ చెప్పడమే. కానీ ఈ క్షమాపణలు చెప్పడంలోనూ కొంతమంది డ్రామాలు మిక్స్ చేస్తారు. నేను చేసిందానికి సారీ…బట్ నువ్వు కూడా అలా చేయాల్సింది కాదు అని చెబుతారు. కానీ ఇక్కడ బట్ (But) అనే వర్డ్‌ను తగిలిస్తే అది సారీ అనిపించుకోదని అది ఎదురుదాడి అవుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
సారీ చెప్పాలనుకున్నపుడు ఎలాంటి వంకలు చెప్పకుండా డైరెక్టుగా ఆమె కళ్లలోకి చూసి, రెండు చేతులూ వారి చేతుల్లోకి తీసుకుని.. నా ప్రవర్తన వల్ల నీకు చాలా బాధ కలిగిందని నాకు బాగా అర్థం అయింది. అందుకే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని చెప్పాలి. ఆ మాట మీ గుండె లోతుల్లోంచి వస్తే.. ఎంతటి అగ్ని పర్వతమైనా ఆ ఒక్క క్షణంలో మంచులా కరిగిపోతుంది.
ఆ తర్వాత ఆమెను దగ్గరగా తీసుకుని తను చెప్పింది ప్రశాంతంగా వినాలి. మీ తప్పు వల్ల ఆమె మనసు ఎంత నలిగిపోయిందో బయటకు చెబుతున్నప్పుడు..సారీ చెప్పాను కదా, ఇంక ఆ విషయం వదిలేయ్ అని అనకుండా.. ఆమె తనలోని బాధనంతా చెప్పే వరకూ ఓపికగా వినాలి.
నువ్వు ఇంతగా బాధ పడటానికి నేనే కారణమని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఆత్మీయంగా ఆమె భుజంపై చేయి వేస్తే చాలు.. ఆ చిన్న స్పర్శ మన మధ్య ఇలాంటివి ఎన్ని జరిగినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనే నిశ్శబ్ద అభయాన్ని ఆమెకు అందిస్తుంది.
అయితే ఇక అంతా సెట్ అనుకోకూడదు..అన్నీ కుదుటపడ్డాకే అసలైన టెస్ట్ మొదలవుతుంది. మాటలతో సారీ చెప్పేసి సరిపెట్టుకోవడం కాదు.. మళ్లీ నా వల్ల ఇలాంటి పరిస్థితి నీకు రాదనే ఛేంజ్‌ను మీ ప్రవర్తనలో(Reassurance) ఆమెకు చూపించాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల మాత్రమే ఆమె నమ్మకాన్ని(Reassurance) మళ్లీ గెలుచుకుంటారు.
నిజానికి ఈ నమ్మకం వల్లే ఆమెల గుండెలోని గాయం పూర్తిగా మానుతుంది. మీ వల్లే ఆమె బాధపడినప్పుడు, ఆ గొడవను తుడిచే మొదటి చేయి మీదే అయినప్పుడు.. మీరు ఓడిపోయినట్లు కాదు. మీ ఇద్దరి జీవితంలో ఎప్పటికీ చెదిరిపోని ఒక గొప్ప విజేతగా మీరు నిలిచినట్లు అర్థం.
Zero Calories Foods : జీరో క్యాలరీస్ – ఫుల్ ప్రోటీన్.. ఈ 7 సూపర్ ఫుడ్స్ తింటే చాలు..
