Sun Tourism
ఒకప్పుడు టూర్ ప్లాన్ అంటే కేవలం ఫేమస్ ప్లేసెస్ చూడటం, అడ్వెంచర్స్ చేయడం లేదా అక్కడకు వెళ్లి షాపింగ్ చేయడానికే పరిమితమయ్యేది. అంతేకాదు టూర్ వెళ్తే ఫోటోలు, వీడియోలతో అక్కడ బిజీబిజీగా గడపాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కంప్లీట్‌గా ట్రెండ్ మారిపోయింది.
ఇలాంటి వాటికే కాకుండా మనసుకి హాయినిచ్చే సూర్యోదయం , సూర్యాస్తమయ సమయాలను మనసుతో , కళ్లతో అనుభవించడం పర్యాటకులకు అత్యంత ఇంపార్టెంట్ అయిన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌గా మారింది. పొద్దున్నే నిద్రలేవడానికి బద్ధకించేవారు కూడా అలారమ్‌లు పెట్టుకుని మరీ, సన్‌రైజ్ చూడటానికి వెళుతున్నారు. ఇంకొంతమంది అయితే సన్ రైజ్ అండ్ సన్‌సెట్ టైమింగ్స్‌ని ముందే చెక్ చేసుకుని ..తమ జర్నీ ప్లాన్‌ను డిజైన్ చేసుకుంటున్నారు.
ఈ ఛేంజ్ కేవలం ఒక ఫ్యాషన్ కోసం కాదు.. బిజీ లైఫ్‌స్టైల్ నుంచి కాస్త విరామం కోరుకునేవారంతా.. ప్రకృతికి దగ్గరగా కనెక్ట్ అవ్వడానికే ఈ గోల్డెన్ అవర్ వేటను సెలక్ట్ చేసుకుంటున్నారు. రోజంతా బిజీగా తిరిగే రొటీన్ సైట్‌సీయింగ్ మాత్రమే కాకుండా, ఉదయాన్నే సూర్యోదయంతో ఆ రోజును ప్రారంభించడం, అలాగే సూర్యాస్తమయంతో ప్రశాంతంగా ఆ డేని ముగించడం ఇప్పుడు కొత్త అలవాటుగా మారింది.
భారత దేశంలో సూర్యోదయం , సూర్యాస్తమయాలను అద్భుతంగా ఆస్వాదించగల ప్రాంతాలు మాత్రం కొన్నే ఉన్నాయి. డార్జిలింగ్‌లోని టైగర్ హిల్ అలాగే తమిళనాడులోని కన్యాకుమారి, గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్, కేరళలోని అలెప్పి అండ్ వర్కల బీచ్‌లు ఈ లిస్టులో ఉన్నాయి.
అంతేకాకుండా గోవాలోని మోర్జిమ్ అండ్ అగోండా బీచ్, ఉదయ్‌పూర్‌లోని పిచోలా సరస్సు, రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సన్‌సెట్ పాయింట్‌తో పాటు కర్ణాటకలోని నంది హిల్స్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాయి. టూరిస్టులు తాము వెళ్లే టూర్ చివరి క్షణంలో కూడా ఒక చివరి సూర్యాస్తమయాన్ని చూడటానికి ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
సన్ సెట్ తర్వాత ఆకాశంలో మారే గులాబీ, నారింజ రంగుల ఆకృతులు మనసును ఎంతగానో మైమరిపిస్తాయని ప్రకృతి ప్రేమికులు చెబుతుంటారు. అయితే ఈ అనుభూతిని మనసారా ఆస్వాదించడానికి పక్కా టైమింగ్స్ పాటించడం మాత్రం చాలా ముఖ్యం. సూర్యోదయం చూడాలనుకునేవారు అనుకున్న టైమ్ కంటే కనీసం 30 నుంచి 45 నిమిషాల ముందే వ్యూ పాయింట్‌కి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
అలాగే సూర్యాస్తమయం చూడాలనుకునేవారు కూడా 45 నిమిషాల నుంచి ఒక గంట ముందే అక్కడికి వెళ్లాలి. దీనివల్ల మంచి స్పేస్ దొరకడంతో పాటు గోల్డెన్ అవర్‌ను ఎలాంటి హడావుడి లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా, సూర్యుడు అస్తమించిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోకుండా మరో 15 నుంచి 30 నిమిషాలు అక్కడే గడపొచ్చు.
Rajinikanth Biopic : ఇక బుక్ రూపంలో తలైవా లైఫ్ జర్నీ..బయోపిక్‌పై సౌందర్య ప్లాన్..
