Trauma Bond : టార్చర్ పెడుతున్నా పార్ట్‌నర్‌ను వదల్లేకపోతున్నారా?.. మీది ట్రామా బాండ్ ఏమో చూసుకోండి..

Trauma Bond : బాధపెట్టిన మనిషే మళ్లీ వచ్చి ఓదారుస్తుండటంతో, బ్రెయిన్ ఆ ఓదార్పును కోరుకుంటూ పదే పదే వాళ్ల దగ్గరకు వెళ్లేలా చేస్తుంది.

Trauma Bond

రోజూ మిమ్మల్ని ఏదొక విషయంపై ఏడిపిస్తుంటారు. మాటిమాటికి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మానసికంగా నరకం చూపిస్తుంటారు. కానీ సడన్‌గా ఒక్కసారి వచ్చి ఏం జరగనట్టు ప్రేమగా మాట్లాడతారు. దీంతో ముందు పెట్టిన టార్చర్ అంతా మర్చిపోయి మీరు కూడా.. తనకు నేనంటే చాలా ఇష్టం, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని మీరు మళ్లీ వాళ్ల ఒడిలోనే వాలిపోతుంటారు.

అవతలి మనిషి వల్ల జీవితంలో పీస్ ఆఫ్ మైండ్ పోతోందని క్లియర్‌గా తెలుస్తున్నా, ఆ రిలేషన్‌ను తెంచుకుని బయటకు రావడానికి మనసు రాదు. అయితే మీ రిలేషన్‌లో ఇదే జరిగితే మాత్రం మీరు ప్యూర్ లవ్‌లో లేరు..ట్రామా బాండ్(Trauma Bond) అనే అత్యంత ప్రమాదకరమైన ఎమోషనల్ గేమ్‌లో ఇరుక్కుపోయారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎలాగంటే డ్రగ్స్‌కి అలవాటు పడినట్లే, మిమ్మల్ని బాధపెట్టే మనిషికి మీ మైండ్ బానిసగా మారిపోయే ఈ సైకలాజికల్ ట్రాప్‌లో పడినట్లు అన్నమాట.

సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం ఒక వ్యక్తి మనల్ని తీవ్రంగా బాధపెట్టడం, వెంటనే అంతకంటే ఎక్కువగా ప్రేమ కురిపించడం చేస్తూ ఒక అబ్యూసివ్ సైకిల్‌ను క్రియేట్ చేసినప్పుడు.. మన మైండ్ ఆ మనిషికి ఎమోషనల్‌గా అడిక్ట్ అయిపోతుంది. దీనినే ‘ట్రామా బాండింగ్’ అంటారు.

అంటే ప్రేమ అలాగే ధ్వేషం, పెయిన్ అండ్ ప్లెజర్ మార్చి మార్చి ఇవ్వడం వల్ల మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు ఎక్కువగా స్పైక్ అయ్యి, మనల్ని ఆ వ్యక్తికి ఒక డ్రగ్‌లా అలవాటు పడిపోయేలా చేస్తాయి. బాధపెట్టిన మనిషే మళ్లీ వచ్చి ఓదారుస్తుండటంతో, మన బ్రెయిన్ ఆ ఓదార్పును కోరుకుంటూ పదే పదే వాళ్ల దగ్గరకు వెళ్లేలా చేస్తుంది.

రిలేషన్‌షిప్‌లో ఉండే పార్ట్‌నర్ అందరి ముందూ అవమానించడం, తిట్టడం లేదా చేయి చేసుకోవడం చేస్తారు. ఆ వెంటనే సెకన్లలో కన్నీళ్లు పెట్టుకుని నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ.. ఆ కోపంలోనే చేశాను అంతే, నువ్వు లేకపోతే ఉండలేనంటూ కాళ్లావేళ్లా పడతారు. అలాగే మాటలతో, చేతలతో నరకం చూపించి, ఆ తర్వాత హఠాత్తుగా పెద్ద పెద్ద గిఫ్టులు కొనిచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు.

Trauma Bond

ట్రామా బాండ్‌లో ఉంటున్నవాళ్లకు సొంత గుర్తింపు, ఆత్మగౌరవం (Self-Esteem) పూర్తిగా పోతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ , పీటీఎస్‌డీ (PTSD) వంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ చుట్టుముడతాయి. ఎప్పుడూ టెన్షన్‌గా బతకడం వల్ల ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది.

మీరు కూడా ఇలాంటి ట్రామా బాండ్‌లో ఇరుక్కుపోయారని అనిపిస్తే.. అది లవ్ కాదు, కేవలం ఒక హార్మోనల్ అడిక్షన్ అని గుర్తుంచుకోవాలి. సైకాలజిస్ట్ సాయం తీసుకుని నో కాంటాక్ట్ రూల్ ఫాలో అయితే ఈ మైండ్ ట్రాప్ నుంచి ఫ్రీడమ్ వస్తుందని అర్ధం చేసుకోవాలి.

Antibiotics : ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ మింగుతున్నారా?..అది మీ ఒంటికి డేంజరస్ పాయిజన్ అని తెలుసా

Exit mobile version