Mind
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు లైఫ్‌లో ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ ఫోన్ కొనాలి, కెరీర్‌లో ఏ దారి ఎంచుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి.. ఇలా ప్రతిదీ మనకు నచ్చినట్లే, కేవలం మన సొంత ఆలోచనలతోనే చేస్తున్నామని అనుకుంటాం.
కానీ సైకాలజీ మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన ఒక షాకింగ్ నిజాన్ని చెబుతోంది. మనం తీసుకునే నిర్ణయాల్లో 90 శాతం మనవి కానే కావట. అవును.. ఇవన్నీ మనకు తెలీకుండానే సొసైటీ, మన కుటుంబం, సోషల్ మీడియా మన మెదడును ప్రోగ్రామ్ చేసి, వారి అజెండాను మన నిర్ణయాలుగా మారుస్తున్నాయని సైకాలజీ చెబుతోంది.
ముందుగా మన నిర్ణయాలను శాసించే ప్లేసులో మొదటిది సొసైటీ . సైకాలజీలో దీనిని సోషల్ కన్ఫర్మిటీ (Social Conformity) అంటారు. అంటే, సొసైటీలో నలుగురూ ఏది చేస్తే అది కరెక్ట్ అని మన సబ్‌కాన్షియస్ మైండ్(Mind) బలంగా నమ్ముతూ ఉంటుంది.
ఉదాహరణకు ఒక ఊరిలో కానీ తమ సర్కిల్‌లో కానీ అందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేదా గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళుతుంటే.. మనకు వేరే ఫీల్డ్‌లో ఎంత టాలెంట్ ఉన్నా కూడా, తెలియకుండానే మన మెదడు కూడా ఆ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతుంది.
అంతెందుకు పక్కింటి వాళ్లు పెద్ద కారు కొనుక్కున్నారని, మన బడ్జెట్‌కు మించినా మనం కూడా అలాంటి కారే కొనాలనుకోవడం సొసైటీ మనపై రుద్దిన నిర్ణయమే అంటారు మానసిక నిపుణులు. ఒకవిధంగా చెప్పాలంటే అందరిలో భిన్నంగా నడుచుకుంటే నలుగురిలో తాము ఒంటరి అయిపోతామేమోననే భయంతో, సొసైటీ గీసిన గీతలోనే నడవడాన్ని మన మెదడు చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా మార్చేసుకుంటుంది.
ఇక రెండోది మన కుటుంబం. చిన్న తనం నుంచి మన పేరెంట్స్, మన ఇంట్లో కుటుంబ సభ్యుల ఆలోచనా విధానం, వారి నమ్మకాలు మన మైండ్‌లో తెలీకుండానే ఒక బలమైన పునాదిగా పడిపోతాయి. దీనిని కండిషనింగ్ అంటారు.
అంటే ఒక వస్తువు మంచిదా కాదా, ఏ కులం వారిని ఎలా గౌరవించాలి, ఏ మతం వారిని ఎలా చూడాలి, జీవితంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయాలతో పాటు , చివరకు అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం కూడా కుటుంబం నుంచే మనకు వస్తాయి. పెద్దయ్యాక మనం ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మనకు మనమే సొంతంగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం కానీ.. నిజానికి ఆ నిర్ణయం మన చిన్నతనంలో కుటుంబం వేసిన ఆ ఆలోచనల పునాది నుంచే బయటకు వస్తుంది.
ఇక ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మనల్నందరినీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తోంది .దీనిని సైకాలజిస్టులు అల్గారిథమ్ మానిప్యులేషన్ అంటారు . అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏ రకమైన కంటెంట్‌ను ఎక్కువసేపు చూస్తున్నారో గమనించి, అదే రకమైన కంటెంట్‌ను మీ ముందుకు పదే పదే తెస్తుందన్న మాట.
దీన్ని ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక అబద్ధాన్ని కానీ ఒకే రకమైన లైఫ్ స్టైల్‌ను కానీ వందల సార్లు చూడటం వల్ల..అదే ప్రపంచం, అదే నిజమని మీ మైండ్(Mind) ఫిక్స్ అయిపోతుంది. రీల్స్‌లో అందరూ లగ్జరీ కార్లలో తిరుగుతూ, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ కనిపిస్తే.. అవి లేని మన జీవితం వ్యర్థం అనే ఫీలింగ్ మనకు తెలీకుండానే మన మైండ్(Mind)లోకి ఎక్కేస్తుంది. అందుకే మనం కొనే వస్తువుల నుంచి మనం నమ్మే సిద్ధాంతాలు చాలా వరకూ కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే జరుగుతున్నాయి.
మరి దీని నుంచి బయటపడాలంటే.. మనం తీసుకునే ప్రతి ముఖ్యమైన డెసిషన్‌కు కాస్త బ్రేక్ ఇవ్వాలి. ఒక ఫోన్ కొనేటప్పుడు అయినా కానీ, కెరీర్ మార్చుకునేటప్పుడైనా కానీ.. ఈ డెసిషన్ నిజంగా నా మనసుకు నచ్చి తీసుకుంటున్నానా.. లేక నలుగురికీ చూపించుకోవడానికి చేస్తున్నానా లేదంటే సోషల్ మీడియాలో చూసి ఇంప్రెస్ అయి తీసుకుంటున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఎప్పుడైతే ఇలా సెల్ఫ్ ఎనాలసిస్ చేసుకోవడం మొదలుపెడతామో, అప్పుడే ఇతరుల ఎఫెక్ట్ మనపై తగ్గి.. మన జీవితానికి మనమే నిజమైన లీడర్లుగా మారతామని సైకాలజిస్టులు చెబుతున్నారు .
Body : మీ బాడీలో ఈ 7 సిగ్నల్స్ లైట్ తీసుకుంటున్నారా? అవి మీ ఆరోగ్యంపై శరీరం ఇచ్చే లీకులట..
