Bengaluru Traffic : 1.2 కోట్లు దాటేసాయి…ట్రాఫిక్ నరకంగా బెంగళూరు

Bengaluru Traffic : మన దేశంలో ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చిరునామాగా చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నగరం ట్రాఫిక్ నరకానికి ప్రత్యక్ష ఉదాహరణ

Bengaluru Traffic

మన దేశంలో ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ట్రాఫిక్(Bengaluru Traffic) కష్టాలకు చిరునామాగా చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నగరం ట్రాఫిక్ నరకానికి ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం పనిదినాల్లో మాత్రమే కాదు ప్రతీరోజూ ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న నగరాల్లో బెంగళూరు కూడా ఉంది.

జనాభాకు తగ్గట్టు వాహనాలు పెరిగిపోవడం, దానికి తగినంత రోడ్లు విశాలంగా లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచేశాయి. తాజాగా బెంగళూరుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో ఇక్కడి ట్రాఫిక్ రద్దీపై చర్చ మొదలైంది. ఈ టెకీ సిటీ ప్రస్తుతం వాహనాల భారంతో సతమతమవుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం 2026 మార్చి చివరినాటికి బెంగళూరు సిటీలోని వాహనాల సంఖ్య 1.23 కోట్లు దాటింది. అంటే ప్రతీ కిలోమీటరుకు రోడ్డుపై సుమారు 900 వాహనాలు ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టు రోడ్లు పెరగకపోవడంతో అక్కడి ప్రజలకు నిత్యం నరకం కనిపిస్తోంది.

గత ఏడాది కాలంలో 8 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీని ప్రకారం చూస్తే సగటున 2100 కు పైగా కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. బెంగళూరు ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలపైనే ఆధారపడడానికి ప్రధాన కారణం ప్రజారవాణా పూర్తి స్థాయిలో లేకపోవడమేనని చెబుతున్నారు. ఆర్టీసీ, మెట్రో వంటివి అక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో లేవు.

Bengaluru Traffic

అందుకే సొంతంగా వాహనాలు కొనుక్కోవడానికి మొగ్గుచూపుతున్నారు. మొత్తం వాహనాల్లో 90 లక్షల వరకూ టూ వీలర్స్ ఉంటే.. 25 లక్షల వరకూ కార్లు ఉన్నాయి. వీటితో పాటు లక్షలాది క్యాబ్ లు, ఆటోలు తిరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ నరకాన్ని తప్పించుకునేందుకు గతంలో కార్లు ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు బైకులు కొంటున్నారు.

హైవే రోడ్లకు చుట్టుపక్కల ఉన్న చిన్న మట్టిరోడ్ల పై నుంచి ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం నివేదికల ప్రకారం బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 40 నిమిషాల సమయం పడుతోంది. అదే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం ఆఫీస్ టైమింగ్స్ లోనూ, సాయంత్రం ఉద్యోగులు ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలోనూ దీనికి రెండు రెట్లు ఎక్కువ టైమ్ పడుతోంది.

ఇటీవల ఓ వ్యక్తి తన స్నేహితుడిని దుబాయ్ ఫ్లైట్ ఎక్కించేందుకు వెళితే… అతను దుబాయి వెళ్లిపోయినా తాను ఇంటికి ఇంకా చేరుకోలేదంటూ ట్వీట్ చేయడం అక్కడి ట్రాఫిక్ రద్దీ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.

MI vs DC : జోరు కొనసాగించేదెవరు ?…ఢిల్లీతో ముంబై ఢీ

Exit mobile version