Just SportsLatest News

MI vs DC : జోరు కొనసాగించేదెవరు ?…ఢిల్లీతో ముంబై ఢీ

MI vs DC : ఐపీఎల్ లో మళ్లీ వీకెండ్ వచ్చేసింది. అభిమానులను అలరించేందుకు డబుల్ హెడర్స్ సిద్ధమయ్యాయి. శనివారం రెండు మ్యాచ్ లు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి

MI vs DC

ఐపీఎల్ లో మళ్లీ వీకెండ్ వచ్చేసింది. అభిమానులను అలరించేందుకు డబుల్ హెడర్స్ సిద్ధమయ్యాయి. శనివారం రెండు మ్యాచ్ లు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్(MI vs DC) తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లూ టోర్నీని మంచి విజయాలతో ఆరంభించడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా హోం గ్రౌండ్ లో దుమ్మురేపేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్ లో ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. బౌలింగ్ తో అద్భుతంగా రాణించి, బ్యాటింగ్ లో తడబడినా సమీర్ రిజ్వీ విధ్వంసంతో పాటు స్టబ్స్ మెరుపులతో చక్కని విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ పైనా అదే జోరు కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి మ్యాచ్ లో నిరాశపరిచిన నిస్సాంకను తప్పించి పృథ్వీషాను తీసుకునే అవకాశముంది. గత ఏడాది కాలంగా తన కెరీర్ ను గాడిన పెట్టుకునేందుకు శ్రమిస్తున్న పృథ్వీషాకు ఈ సీజన్ మంచి అవకాశం. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీనే కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ బ్యాటింగ్ లో రాహుల్ , నితీష్ రాణా, మిల్లర్, విప్రజ్ నిగమ్ పై అంచనాలున్నాయి. బౌలింగ్ పరంగా మార్పులు లేనట్టే. మిఛెల్ స్టార్క్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో లుంగి ఎంగిడి, నటరాజన్, ముఖేశ్ కుమార్ పేస్ ఎటాక్ లో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో వీరంతా రాణించారు.

MI vs DC
MI vs DC

మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్ ను ఘనవిజయంతో మొదలుపెట్టింది.తద్వారా ప్రతీ సీజన్ తొలి మ్యాచ్ లో ఓడిపోయే సంప్రదాయానికి చెక్ పెట్టింది. రోహిత్ శర్మ, రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆరంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించే ముంబైకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ , రికెల్టన్, సూర్యకుమార్ , తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ లాంటి హిట్టర్స్ అంతా ముంబై జట్టులోనే ఉన్నారు.

అటు సూర్యకుమార్ యాదవ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా కొనసాగించడం ఖాయమైంది. బౌలింగ్ లో బుమ్రా, బౌల్ట్ , శార్థూల్ ఠాకూర్ పేస్ బౌలింగ్ ను నడిపిస్తున్నారు. ఈ బౌలింగ్ ను తట్టుకుని పరుగులు చేయడం ఢిల్లీ బ్యాటర్లకు సవాల్ గానే చెప్పాలి. గత రికార్డుల్లో ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 37 మ్యాచ్ లలో తలపడితే ముంబై 21 సార్లు గెలిచింది. ఢిల్లీ 16 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.

Gujarat Titans vs Rajasthan Royals : రాయల్స్ వర్సెస్ టైటాన్స్…గుజరాత్ గెలుపు బాట పట్టేనా ?

Related Articles

Back to top button