Caste : మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు రావు..ప్రభుత్వ ఉత్తర్వు కొట్టివేసిన హైకోర్టు

Caste : ఇతర వెనుకబడిన, అణగారిన వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్‌ను వర్తింపజేస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఒక ఉత్తర్వుపై హైకోర్టు సీరియస్ అయింది.

Caste

మతం మార్పిడులతో పాటు వాటి ద్వారా పొందే రిజర్వేషన్ ప్రయోజనాలపై మద్రాస్ హైకోర్టు ఒక అత్యంత కీలకమైన, సంచలన తీర్పును ఇచ్చింది. ఇతర వెనుకబడిన, అణగారిన వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి ముస్లిం (BCM) కేటగిరీ కింద రిజర్వేషన్‌ను వర్తింపజేస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఒక ఉత్తర్వుపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ ప్రభుత్వ జీవో రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఏకంగా దానిని రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

అసలు వివాదానికి కారణమైన తమిళనాడు ప్రభుత్వ జీవోను ఒకసారి పరిశీలిస్తే.. 2024 మార్చి 9వ తేదీన తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉత్తర్వును తీసుకొచ్చింది. దీని ప్రకారం వెనుకబడిన తరగతులు అంటే బీసీ (BC), అత్యంత వెనుకబడిన తరగతులు అంటే ఎంబీసీ(MBC) , డినోటిఫైడ్ కమ్యూనిటీస్ అంటే డీఎన్‌సీ (DNC) తో పాటు షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్‌సీ (SC)కి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ..ఒకవేళ ఇస్లాం మతం(Caste )లోకి మారినా కూడా, వారు బీసీ ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనాలను పొందొచ్చని ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏడు ప్రత్యేక బీసీ ముస్లిం వర్గాలలో ..ఏదొక వర్గానికి చెందిన సభ్యులుగా వారిని గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి కూడా అధికారులకు అనుమతులు మంజూరు చేసింది.

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిపిన చెన్నై హైకోర్టు.. తమిళనాడు ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని.. చట్టపరంగా , రాజ్యాంగబద్ధంగా కూడా పూర్తిగా తప్పని తేల్చి చెప్పేసింది.

ఇతర సామాజిక వర్గాల నుంచి ఇస్లాం మతం(Caste )లోకి మారిన ఏ వ్యక్తి కూడా.. వెనుకబడిన తరగతి ముస్లిం హోదాను క్లెయిమ్ చేయడానికి వీల్లేదంటూ ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.

ఒక వ్యక్తి ఇష్టపడి మతం(Caste )మారిన తర్వాత అతను కేవలం ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడు మాత్రమే అవుతాడని, అంతేకానీ ఇస్లాంలో లేని ఒక ప్రత్యేక సామాజిక వర్గానికో, కులానికో చెందినవాడిగా మారడం సాధ్యం కాదని కోర్టు లీగల్ పాయింట్‌ను లేవనెత్తి తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తమిళనాడు ప్రభుత్వం గతంలో నిర్దేశించిన 7 ప్రత్యేక వెనుకబడిన ముస్లిం వర్గాలైన అన్సార్, దక్కనీ ముస్లింలు, దూదేకుల, లబ్బాయి, మాపిళ్ల, షేక్, సయ్యద్‌లలోకి కొత్తగా మతం మారిన వారిని చేర్చడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పేసింది.

అందువల్ల వారంతా ఆయా వర్గాల కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులు కారని క్లారిటీ ఇచ్చింది. నిజానికి జూలై 2008లో జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా తమిళనాడులోని ఈ ఏడు ముస్లిం వర్గాలను స్పెషల్‌గా బీసీఎం అనే ప్రత్యేక కేటగిరీలో చేర్చారు.

అయితే, ఇతర కులాల నుంచి ముస్లింలుగా మారిన వారికి కూడా ఇలా సర్టిఫికెట్లు ఇవ్వాలనే 2024 నాటి ప్రభుత్వ నిర్ణయం చెల్లదని ధర్మాసనం స్పష్టం చేయడంతో తమిళనాడు ప్రభుత్వానికి.. న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

Caste

మొత్తంగా ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వల్ల ఇకపై తమిళనాడులో ఇతర ఏ సామాజిక వర్గం (BC, MBC, SC, ST) నుంచి అయినా సరే.. ముస్లిం మతంలోకి మారిన వారికి బీసీ ముస్లిం (BCM) కోటా కింద స్కూలు, కాలేజీలో సీట్లు గానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండవు.

నిజానికి తాజా తీర్పు కేవలం తమిళనాడు రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా మతం మార్పిడి ఆధారంగా రిజర్వేషన్ల ప్రయోజనాలను ఆశించే ఇతర రాష్ట్రాల విధానాలపై , భవిష్యత్ కేసులపై కూడా బలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

Numerology : మీ డేట్ ఆఫ్ బర్త్ 7, 16, 25 ?.. అయితే మీ మైండ్‌లో ఏముందో ఎవరూ ఊహించలేరు..

Exit mobile version