CM Vijay
తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన హీరో, టీవీకే చీఫ్ విజయ్ ప్రస్తుతం సీఎంగా పాలనలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రి వర్గం కూర్పు, తర్వాత పాలనాపరమైన నిర్ణయాలతో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసి తమిళనాడు అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
ఒకవైపు పాలనపారమైన బాధ్యతలతో బిజీగా ఉంటూ కూడా జనంలోకి వెళ్లేందుకు విజయ్(CM Vijay) సిద్ధమయ్యారు. సీఎం హోదాలో దళపతి తొలి పర్యటన చేయబోతున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో విజయ్ పర్యటించబోతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు.
అనంతరం తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేసిన విజయ్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళుతున్నారు. సీఎం హోదాలో తొలి పర్యటన కావడం,అది కూడా ప్రజల మధ్యన జరగనుండడంతో టీవీకే నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల తర్వాత చాలా హైడ్రామా మధ్య విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అత్యధిక సీట్లు గెలిచినా కూడా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయారు. అయితే కాంగ్రెస్ తో సహా వామపక్షాలు, ఇతర చిన్న పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుంచీ మరింత బిజీగా మారిన విజయ్(CM Vijay) పలు కీలక శాఖల సమీక్షలతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరిగెత్తిస్తున్నారు. గత మూడు రోజులుగా కీలక సమావేశాలు ముగించుకున్న విజయ్ ఇప్పుడు ప్రజల మధ్యలో కొన్ని రోజుల పాటు గడపనున్నారు. దీనిలో భాగంగా తనను గెలిపించిన రెండు నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు.
అనంతరం ఎంపిక చేసుకున్న పలు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. తిరుచ్చి పర్యటన వివరాలు చూస్తే అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం సొంత ఓపెన్ వ్యాన్ లో ప్రయాణిస్తూ ప్రజలకు, టీవీకే కార్యకర్తలకు అభివాదం చేసేలా రోడ్ షో ప్లాన్ చేశారు.
తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్‌లోఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ తిరుచ్చి పర్యటన తర్వాత విడతల వారీగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.
Trump : సీజ్ ఫైర్‌పై నిర్ణయం తీసుకోని ట్రంప్.. మళ్లీ యుద్ధం తప్పదా ?
