Dharmendra Pradhan
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసనలు తీవ్రమవడంతో ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా అర్థరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇవాళ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.
పరీక్షల పేపర్ లీకేజీల నివారణ అనేది ఒక జాతీయ బాధ్యత అని ప్రధాని చెప్పారు. ఈ వ్యవహారంలో దోషులకు కఠిన శిక్షలు పడేలా వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిందితులు ఇప్పటికే జైల్లో ఉన్నారని మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.
అయితే కేబినెట్ మీటింగ్‌లో కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయని మోదీ స్పష్టం చేసిన వేళ..ఇప్పుడు ఏం జరగబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan)ను పదవి నుంచి తొలగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తక్షణమే రాజీనామా చేయాలంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆయనను తొలగించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. కానీ రెండు రోజులుగా జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్ సమీపంలో నిరసనలు తీవ్రమయ్యాయి.
కాగా పేపర్ లీక్ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఇప్పటికే విద్యాశాఖ ఉన్నత కార్యదర్శి వినీత్ జోషిని ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్‌ను నియమించింది. పరీక్షల పేపర్ లీకేజీలపై విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.
మరోవైపు 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. కేంద్రం తన మెయిన్ డిమాండ్లపై సానుకూల హామీలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లేహ్-లద్ధాఖ్ అపెక్స్ బాడీ లీడర్స్ సమక్షంలో సోనమ్ వాంగ్‌చుక్ జ్యూస్ తీసుకుని దీక్షను ముగించారు.
దీక్ష విరమణ తర్వాత ఎక్స్ వేదికగా వాంగ్‌చుక్..26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను ముగించినట్లు చెప్పారు. వివిధ పొలిటికల్ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు తనను దీక్ష విరమించాలని కోరారని వివరించారు.
కాగా సోనమ్ వాంగ్‌చుక్ నిరహార దీక్ష విరమించినా ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Water Manifestation : వాటర్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? గ్లాసు నీళ్లతో మన కోరికలు తీరుతాయా?
