Ethanol Petrol
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ హాట్ టాపిక్‌గా మారింది. ఇది వాడాలంటూ కేంద్రం, వాడితే వాహనాల్లో సమస్యలు వస్తున్నాయంటూ వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఇథనాల్ పెట్రోల్ ఉపయోగించాలా వద్దా అన్న చర్చ మరింత పెరిగింది.
దేశీ ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం , పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా కార్బన్ ఉద్గారాల తగ్గింపు కీలకమైన అంశంగా చెబుతున్నారు.
ఎందుకంటే ఇథనాల్ స్వచ్ఛమైన ఇంధనం. దీనిని పెట్రోల్‌లో కలపడం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ లాంటి హానికరమైన కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గుతాయి. ముడిచమురు కోసం భారతదేశం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.
పెట్రోల్‌లో ఇథనాల్ వాడటం ద్వారా భారతదేశం ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాలలోని వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. దీని ఉత్పత్తి పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి, చక్కెర పరిశ్రమలకు అదనపు ఆదాయం లభిస్తుంది.
మరోవైపు ఇథనాల్ పెట్రోల్(Ethanol Petrol) వల్ల పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం , నిపుణుల వివరణ ప్రకారం ఆధునిక బీఎస్ 6 రకం వాహనాల్లో దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ, చాలా పాత మోడల్ వాహనాల్లో మాత్రం సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు.
ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉండడంతో వాహనాల మైలేజీలో 5 శాతం వరకు తగ్గుదల కనిపిస్తోందని గుర్తించారు. అయితే కేంద్రం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. కొన్ని పాత వాహనాల్లో మాత్రం మైలేజీలో సమస్యలు ఉండొచ్చని చెబుతోంది. కొత్త వాహనాల్లో ఇథనాల్ పెట్రోల్‌తో ఎటువంటి ఇబ్బందులు రావడం లేదని పేర్కొంటోంది.
కొంతమంది ప్రముఖులు మాత్రం ఇథనాల్ పెట్రోల్‌తో సమస్యలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బ్రెజిల్ తరహాలో దశల వారీగా అమలు చేసి ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇథనాల్ పెట్రోల్(Ethanol Petrol) విధానం బీజేపీకి తలనొప్పిగా మారొచ్చని నటుడు నరేశ్ కూడా దీని గురించి వ్యాఖ్యానించారు. కానీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఈ ప్రోత్సాహం వెనుక దేశానికి లబ్ది చేకూర్చే వ్యూహం ఉందని చెబుతోంది.
Trainee IPS : పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అరాచకం..లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌కు వేధింపులు
